కొత్త డేటా ప్యాక్ ప్రవేశపెట్టిన జియో

కొత్త డేటా ప్యాక్ ప్రవేశపెట్టిన జియో

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని టెలికాం దిగ్గజం సంస్థ జియో హ్యాపీ న్యూ ఇయర్ 2023 పేరిట కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్స్ ని తీసుకొచ్చింది. అందులో ఇప్పటికే ఉన్న ఆన్యువల్ ప్లాన్ రూ.2999ని సవరిస్తూ కొత్త మార్పులు తీసుకొచ్చింది. అంతేకాకుండా 2023 సంవత్సరాన్ని తెలియజేసేవిధంగా రూ.2023 విలువ గల కొత్త ప్లాన్ ని లాంచ్ చేసింది. 

ఈ డేటా ప్లాన్ తో రోజుకు 2.5 జీబీ మొబైల్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి. కాకపోతే ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నది 252 రోజులే. అంటే ప్రస్తుత నెలవారి అన్ లిమిటెడ్ ప్లాన్ 28 రోజులు ఉంది. దాన్ని 9 బిల్లింగ్ సైకిల్లకు (నెలలకు) లెక్క కడితే నెలకు రూ.225తో రీచార్జ్ ప్లాన్ చేసుకున్నట్లు. 

రూ. 2999తో ఉన్న రీచార్జ్ ప్లాన్ తో అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ పొందేవాళ్లు. 912.5 జీబీ డేటాతో 365 రోజులు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉండేది. అయితే, ఈ ప్లాన్ ని మార్చుతూ అదనంగా మరో 75 జీబీ డేటా, 23 రోజులకు తన సర్వీస్ లు అందించనుంది.