Today OTT Movies: ఇవాళ (ఆగస్టు8) ఒక్కరోజే ఓటీటీలోకి 15కి పైగా సినిమాలు.. తెలుగులో ఇవి అస్సలు మిస్సవకండి

Today OTT Movies: ఇవాళ (ఆగస్టు8) ఒక్కరోజే ఓటీటీలోకి 15కి పైగా సినిమాలు.. తెలుగులో ఇవి అస్సలు మిస్సవకండి

ఇవాళ శుక్రవారం (2025 ఆగస్ట్ 8న) ఓటీటీలోకి కొత్త సినిమాలు దర్శనమిచ్చాయి. థియేటర్ సినిమాలకంటే ఓటీటీల్లోనే సినిమాల జాతర కనిపిస్తుంది. ఇవాళ ఒక్కరోజే 15కి పైగా సినిమాలు, సిరీస్లు ఓటీటీకి ఎంట్రీ ఇచ్చాయి. విలేజ్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్, యాక్షన్, సైకలాజికల్ వంటి అన్నిరకాల జోనర్లో సినిమాలు స్ట్రీమింగ్కి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా తెలుగులో 8 సినిమాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయనేది ఓ లుక్కేద్దాం. 

అమెజాన్ ప్రైమ్:

అరేబియా కడలి (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - ఆగస్టు 08

జీ5:

మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు రూరల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 08

మామన్ (తమిళ మూవీ) - ఆగస్టు 08

జరన్ (మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్) - ఆగస్టు 08

నెట్‌ఫ్లిక్స్:

ఓ ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ) - ఆగస్టు 08

స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ క్రైమ్ డాక్యుమెంటరీ)- ఆగస్టు 08

సోనీ లివ్:

మయసభ (తెలుగు సిరీస్) - ఆగస్టు 07

ఈటీవీ విన్:

బద్మాషులు (తెలుగు కామెడీ డ్రామా)- ఆగస్టు 08

SUN NXT:

హెబ్బులి కట్ (కన్నడ సినిమా) - ఆగస్టు 08

మాయకూతు (తమిళ ఫాంటసీ క్రైమ్ డ్రామా)- ఆగస్టు 08

MX ప్లేయర్:

బిండియే కే బాహుబలి (హిందీ సిరీస్)- ఆగస్టు 08

హాట్‌స్టార్:

సలకార్ (తెలుగు డబ్బింగ్ హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 08

సైనా ప్లే:

నడికర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ)- ఆగస్టు 08

లయన్స్ గేట్ ప్లే:

ప్రెట్టీ థింగ్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్టు 08

బ్లాక్ మాఫియా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08

తెలుగులో ఇవి మిస్సవకండి:

‘అరేబియా కడలి’::

సత్యదేవ్, ఆనంది లీడ్ రోల్స్‌‌‌‌లో వి.వి. సూర్య కుమార్ తెరకెక్కించిన వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ‘అరేబియా కడలి’. ఈ సర్వైవల్‌‌‌‌ డ్రామాకు దర్శకుడు క్రిష్‌‌‌‌ జాగర్లమూడి, చింతకింది శ్రీనివాసరావు క్రియేటర్స్‌‌‌‌గా వ్యవహరించగా.. వై.రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఆగస్టు 8 నుంచి ప్రైమ్‌‌‌‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 

ప్రత్యర్థి గ్రామాల నుండి వచ్చిన మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, ఓ విదేశీ ప్రాంతంలో బందీలుగా మారిన విషాదకర సంఘటన నేపథ్యంలో సాగే ఫిక్షన్‌‌‌‌ స్టోరీ ఇది. మత్స్యకారుల సముద్రపు ప్రమాదాలు, బందీలుగా వారి జీవితాలను ప్రధానంగా ఇందులో చూపించబోతున్నారు. అలాగే, వీరు సముద్ర మార్గంలో వెళ్ళేటపుడు ఊహించని స్నేహాలు, అనుకోని కొత్త సంబంధాలు, ఎదుర్కొనే భయంకరమైన శత్రువుల మూలాలు ఆసక్తిగా ఉండనున్నాయి. 

మోతెవరి లవ్ స్టోరీ:

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన వెబ్ సిరీస్ ‘మోతెవరి లవ్‌‌‌‌ స్టోరీ’.అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జంటగా నటించిన ఈ సిరీస్‌‌‌‌కు శివ కృష్ణ బుర్రా దర్శకుడు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ కలిసి నిర్మించారు. ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏడు ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో కామెడీ, లవ్ సహజమైన రీతిలో అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇలా మయసభ, బద్మాషులు, ఓ ఎంథన్ బేబీ, సలకార్ హిందీ తెలుగు డబ్బింగ్, నడికర్ తెలుగు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.