మునుగోడులో కేడర్​ను కాపాడుకునేందుకు కాంగ్రెస్​ ప్రయత్నం

మునుగోడులో కేడర్​ను కాపాడుకునేందుకు కాంగ్రెస్​ ప్రయత్నం

నల్గొండ : మునుగోడు నియోజకవర్గంలో కేడర్​ను కాపాడుకునేందుకు కాంగ్రెస్​ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని చండూరులో శుక్రవారం మనోధైర్య సభ నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ప్రభుత్వ హైస్కూల్​లో సభ జరగనుంది. కార్యక్రమానికి భారీగా జనాన్ని తరలించాలని భావిస్తున్న లీడర్లు.. ప్రతి మండలానికి ఒక కమిటీని వేశారు. మీటింగ్​లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేరికల కమిటీ చైర్మన్ కె.జానారెడ్డి, ప్రచార కమిటీ నాయకులు మధుయాష్కీగౌడ్, సీతక్క, అంజన్​కుమార్ యాదవ్, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.