పండుగ పూట పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

పండుగ పూట పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్లో తులం ఎంతంటే?

ఏ సీజన్ లో అయిన బంగారానికి డిమాండ్ మామూలుగా ఉండదు. బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ చెప్పలేరు. సంక్రాంతి పండుగ సందర్భంగా బంగారం ధర పెరిగింది. 

హైదరాబాద్ లో జనవరి 16వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.170 వరకు పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.58,150 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,440 దగ్గర ఉంది. కాగా తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో చూద్దాం.

ఇక బంగారం, వెండి రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లు ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ కారణంతోనే హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో బంగారం రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో వెండి ధర మాత్రం దిల్లీలో తక్కువగా ఉంటుంది.

దిల్లీ మార్కెట్లో గోల్డ్ రేట్ స్థిరంగా ఉంది. ఇక్కడ 22 క్యారెట్స్ పసిడి ధర తులానికి ప్రస్తుతం రూ. 58,150 దగ్గర ఉండగా.. 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 63,420 వద్ద ట్రేడవుతోంది.

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 63,270
  • విజయవాడ..రూ. 63,270
  • ముంబాయి..రూ. 63,270
  • బెంగళూరు..రూ. 63,270
  • చెన్నై..రూ. 63,760
  •  

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 58,000
  • విజయవాడ..రూ. 58,000
  • ముంబాయి..రూ. 58,000
  • బెంగళూరు..రూ. 58,000
  • చెన్నై..రూ.58,450

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 78,000
  • విజయవాడ..రూ. 78,000
  • చెన్నై..రూ. 78,000
  • ముంబాయి..రూ. 76,500
  • బెంగళూరు..రూ. 73,250
  •