ప్రతిపక్షాలకు దీదీ సవాల్

ప్రతిపక్షాలకు దీదీ సవాల్

తన ఊపిరి ఉన్నంత వరకూ బెంగాల్ ప్రజల కోసమే పని చేస్తానని, మరోసారి తన తల్లిదండ్రుల ముందు ప్రమాణం చేసి చెబుతున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. భారతదేశానికి బెంగాల్ అన్ని రంగాల్లోనూ మార్గదర్శకంగా ఉంటోందన్నారు. తమ ప్రభుత్వం (టీఎంసీ) అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలకు దమ్ము ధైర్యం ఉంటే 11 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తనను సవాల్ చేయవచ్చన్నారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వల్ల, కుట్రలు, కుతంత్రాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ ప్రతిపక్షాలను హెచ్చరించారు.

తమ ప్రభుత్వంతో పాటు తనపై ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోనన్నారు. తన రాష్ట్ర ప్రజల బాగోగుల కోసమే పని చేస్తానని చెప్పారు. బెంగాల్ లో దుర్గాపూజ చేసుకునేవారు ఈద్‌ను కూడా నిర్వహించుకుంటారని, తాము అన్ని పండుగలను కలిసే జరుపుకొంటామన్నారు.

అన్ని రంగాల్లోనూ పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. నేడు ఉత్తరప్రదేశ్ లో బాలికలకు జరుగుతున్న అన్యాయాల పట్ల, న్యాయం చేయాలని కోరితే.. బాధితులనే నిందితులుగా చేరుస్తున్నారని ఆరోపించారు. కానీ, బెంగాల్ లో మాత్రం యూపీ తరహాలో జరగడం లేదన్నారు. తమ సొంత పార్టీ ( తృణమూల్ కాంగ్రెస్ ) కార్యకర్తలు తప్పు చేస్తే వారిని కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. అయితే కొందరు ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

హర్యానాలో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్