నేడు జీ20 సమ్మిట్ పై అఖిలపక్ష భేటీ.. ఏపీ నుంచి జగన్, చంద్రబాబు

నేడు జీ20 సమ్మిట్ పై అఖిలపక్ష భేటీ.. ఏపీ నుంచి జగన్, చంద్రబాబు

జీ20 సమ్మిట్ పై చర్చించేందుకు నేడు ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 40 రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్షులకు ఆహ్వానం పంపారు. జీ20 లక్ష్యాలపై పార్టీల అభిప్రాయాలను ప్రధాని మోడీ తీసుకోనున్నారు. ప్రెసిడెన్సీ లక్ష్యాల గురించి పార్టీల నేతలకు ఆయన వివరించనున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల నుంచి ప్రధాని మోడీ సూచనలు స్వీకరించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ఈ సమావేశం జరగనుంది.

కేంద్రం నుంచి ఆహ్వానం మేరకు ఏపీ నుంచి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇద్దరు వేరువేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ప్రధాని ప్రసంగం కంటే ముందు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ మాట్లాడనున్నారు. అటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్ ఈ నెల 1న అధికారికంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీ జీ-20 కూటమి సమావేశం జరగనుంది.