సిరీస్‌ చిక్కేనా

సిరీస్‌ చిక్కేనా

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌కు అదిరిపోయే క్లైమాక్స్‌‌‌‌ ఇచ్చేందుకు టీమిండియా రెడీ అయ్యింది..! సీనియర్లు లేకపోయినా.. గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో చూపిన తెగువతో ఇప్పుడు సిరీస్‌‌‌‌ను కూడా గెలవాలని యంగ్‌‌‌‌ ఇండియా టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది..! ఈ నేపథ్యంలో నేడు బెంగళూరులో జరిగే ఆఖరిదైన ఐదో టీ20లో సఫారీలతో అమీతుమీ తేల్చుకునేందుకు పంత్‌‌‌‌సేన సిద్ధమైంది..! మరోవైపు ఇప్పటివరకు ఇండియాలో సిరీస్‌‌‌‌ కోల్పోని సౌతాఫ్రికా.. ఆ రికార్డును అలాగే కొనసాగించాలని ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది..! ఇంకోవైపు ఈ మ్యాచ్​కు వాన ముప్పు ఉండటం ఇరు జట్లతో పాటు ఫ్యాన్స్​ను ఆందోళనకు గురి చేస్తోంది!

బెంగళూరు: 
టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌ ప్రాబబుల్స్‌‌‌‌పై ఓ అంచనాకు వచ్చిన ఇండియా.. ఇప్పుడు మరికొన్ని బలహీన అంశాలను సరి చూసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగే ఐదో టీ20లో ఈ సమస్యలకు పరిష్కారం రాబట్టాలని భావిస్తోంది. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ (2–2)ను డిసైడ్‌‌‌‌ చేసే పోరు కావడంతో అటు విజయంతో పాటు ఇటు ప్లేయర్ల ఆటతీరును మరోసారి పూర్తి స్థాయిలో పరిశీలించాలని చీఫ్ కోచ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌ వేస్తున్నాడు. ఎనిమిది రోజుల వ్యవధిలో నాలుగు మ్యాచ్‌‌‌‌లు ఆడటం, గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో సమష్టిగా రాణించడంతో.. టైటిల్‌‌‌‌గా భావిస్తున్న ఈ పోరులో టీమిండియా ఫేవరెట్‌‌‌‌గా దిగుతోంది.

అదే జట్టుతో..
ఈ మ్యాచ్‌‌‌‌ కోసం టీమిండియా ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. నాలుగో మ్యాచ్‌‌‌‌లో ఆడిన టీమ్‌‌‌‌నే  దించనుంది. అయితే ఓపెనర్లలో ఇషాన్‌‌‌‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. రుతురాజ్‌‌‌‌ భారీ ఇన్నింగ్స్‌‌‌‌ బాకీ ఉన్నాడు. అలాగే శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌‌‌‌లో బ్యాట్‌‌‌‌ ఝుళిపించకపోతే వీళ్ల ఫ్యూచర్‌‌‌‌ ఇబ్బందుల్లో పడ్డట్లే. ఎందుకంటే మిడిలార్డర్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌, దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ సూపర్‌‌‌‌ షో చూపెడుతున్నారు. స్పెషలిస్ట్‌‌‌‌ కీపర్‌‌‌‌ అయిన కార్తీక్‌‌‌‌.. ఐర్లాండ్‌‌‌‌తో సిరీస్‌‌‌‌లో కీపింగ్​ బాధ్యతలను కూడా నెరవేర్చనున్నాడు. దీంతో పంత్‌‌‌‌పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఈ మ్యాచ్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ ఫెయిలైతే తన ప్లేస్‌‌‌‌ను సూర్యకుమార్‌‌‌‌కు ఇచ్చుకోవాల్సిందే. తొలి రెండు మ్యాచ్‌‌‌‌లతో పోలిస్తే.. తర్వాతి రెండు టీ20ల్లో ఇండియా పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ పదును బాగా పెరిగింది. భువనేశ్వర్‌‌‌‌ బంతిని కొత్తగా స్వింగ్‌‌‌‌ చేస్తున్నాడు. అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ బౌన్సర్లతో పాటు హార్డ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌లను బాగా ఉపయోగిస్తున్నాడు. హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ కూడా రాణిస్తే విజయం మనదే అవుతుంది. స్పిన్నర్లు  ఇంకాస్త మెరుగవ్వాలి. అక్షర్‌‌‌‌.. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ పాత్రకు న్యాయం చేయాలి. 

బవూమ డౌటే!
నాలుగో మ్యాచ్‌‌‌‌లో గాయపడిన సౌతాఫ్రికా కెప్టెన్‌‌‌‌ టెంబా బవూమ ఈ మ్యాచ్‌‌‌‌కు అందుబాటులో ఉండటంపై సందిగ్దత నెలకొంది. తను బ్యాటర్‌‌‌‌గా కంటే కెప్టెన్‌‌‌‌గా ఉండటం టీమ్‌‌‌‌కు చాలా ప్లస్‌‌‌‌ పాయింట్‌‌‌‌. మోచేతి గాయం నుంచి బవూమ కోలుకోకపోతే అతని ప్లేస్​లో హెండ్రిక్స్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో ఉంటాడు. కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా వ్యవహరిస్తాడు. తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో మంచి కాంబినేషన్‌‌‌‌తో దిగిన సఫారీలు.. గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఈ మ్యాచ్‌‌‌‌కు మంచి కాంబినేషన్‌‌‌‌ను దించాలని సఫారీ టీమ్​ చూస్తోంది. ఓపెనింగ్‌‌‌‌లో డికాక్‌‌‌‌, హెండ్రిక్స్‌‌‌‌ మంచి ఆరంభాన్నిస్తే, మిడిలార్డర్‌‌‌‌లో డసెన్‌‌‌‌, మిల్లర్‌‌‌‌, క్లాసెన్‌‌‌‌ చూసుకుంటారు. కానీ ఓపెనర్లు ఫెయిలైతే వీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఆల్​రౌండర్​ డ్వేన్​ ప్రిటోరియస్‌‌‌‌ మరోసారి బ్యాట్‌‌‌‌కు పని చెప్పాలి. బౌలింగ్‌‌‌‌లో జెన్‌‌‌‌సెన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో పార్నెల్‌‌‌‌ వచ్చే చాన్స్‌‌‌‌ ఉంది. రబాడ ఎంట్రీ ఇవ్వనున్నాడు. నోర్జ్‌‌‌‌కు ఈ ఇద్దరు అండగా నిలిస్తే ఇండియాకు ఇబ్బందులు తప్పవు. స్పిన్నర్లలో కేశవ్‌‌‌‌, షంసి సత్తా చాటాల్సి ఉంది.