
శుక్రవారం వస్తుందంటే.. సినిమాల జాతర మొదలైనట్టే. చిన్న, పెద్ద, భాష భావం అనేవేవి తేడా లేకుండా రిలీజ్ అవుతాయి. ప్రేక్షకులు కూడా రిలీజైన ప్రతి భాషాచిత్రాన్ని చూడటానికి సిద్ధంగా ఉంటారు. ఇక సినిమా టాక్ బాగుందంటే చాలు.. ఎగబడి మరి ట్కికెట్లు కొనుక్కుంటారు.
ఈ శుక్రవారం (మే16న) కూడా 3 సినిమాలు తెలుగులో రిలీజ్ కానున్నాయి. అయితే, నేడు వచ్చిన ఈ సినిమాలు చిన్న బడ్జెట్ కావడం వల్ల, పెద్దగా ప్రమోషన్స్ కనిపించకపోవడం వల్ల పెద్దగా ఎవరికీ తెలియకుండా పోయింది. కానీ, మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? వాటి జోనర్స్ ఏంటనేది తెలుసుకుందాం.
‘23’:
ప్రియదర్శి మల్లేశం’ మూవీతో మెప్పించిన దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘23’. 0రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో తేజ, తన్మయి లీడ్ రోల్స్ చేస్తున్నారు. స్టూడియో 99 సంస్థ నిర్మిస్తోంది. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేసింది.
1991 చుండూరు ఊచకోత, 1993 చిలకలూరి పేట బస్సు అగ్నిప్రమాదం, 1997 జూబ్లీహిల్స్ కారు బాంబు దాడి ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కేవలం ఘటనలనే చూపించడం కాకుండా, వాటి వెనుక ఉన్న ఆందోళన, హింసకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా మూవీను రాజ్ ఆర్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
లెవెన్:
నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. నేడు శుక్రవారం (మే 16న) తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదలైంది. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో రేయా హరి హీరోయిన్‌గా నటించింది. అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, శ్రుతిహాసన్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ దక్కింది. డి ఇమ్మాన్ సంగీతం అందించాడు.
డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్:
తమిళ ఇండస్ట్రీలో స్టార్ కెమెడియన్ సంతానం.. తనదైన నటనతో ఆడియన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ ఫేమ్ తోనే ఈ మధ్యే హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. అలా పలు సినిమాల్లో కూడా నటించాడు.
లేటెస్ట్గా సంతానం ప్రధాన పాత్రలో నటించిన మూవీ డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ నేడు 16నమే 2025న థియేటర్లలో విడుదలైంది. కామెడీ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది. ఇకపోతే ఈ మూవీని ఆర్యా ‘ది షో పీపుల్’ మరియు వెంకట్ బోయనపల్లి ‘నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్’బ్యానర్‌లపై నిర్మించారు.