ఇవాళ T20 ఫైనల్: ఇండియా VS న్యూజిలాండ్

ఇవాళ T20 ఫైనల్: ఇండియా VS న్యూజిలాండ్

హామిల్టన్  వేదికగా ఇండియా, న్యూజిలాండ్ ల మధ్య మూడో టీ20 జరగనుంది. 3 టీ20 ల సిరీస్ లో రెండు టీంలు ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి. ఈరోజు జరిగేదే సిరీస్ డిసైడింగ్ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్లో విక్టరీ కొట్టి….. సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది రోహిత్ సేన.

ఇక వన్డే సిరీస్ పోగొట్టుకున్న న్యూజిలాండ్ టీ20 అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. హోమ్ టీం న్యూజిలాండ్ పైనే ఎక్కువ ప్రెజర్ ఉంది. లాస్ట్ టీ20 గెలిచి రికార్డ్ క్రియేట్ చేసిన టీమిండియా…. న్యూజిలాండ్ లో ఫస్ట్ టైం టీ20 విన్ రుచి చూసి కాన్ఫిడెంట్ గా ఉంది.

అంతకు ముందు వన్డే సిరీస్ లో పూర్తి ఆధిపత్యం సాధించింది టీమిండియా. 5 వన్డేల సిరీస్ ను 4-1 తో గ్రాండ్ గా ముగించింది. అయితే ఓడిపోయింది ఒక్క మ్యాచే అయినా… మరీ దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా కేవలం 92 రన్లకే ఆలౌటైంది. మరోవైపు న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇండియా ఘోర పరాజయం చవిచూసిన ఈ మ్యాచ్ హామిల్టన్ లో జరిగింది. ఈ గ్రౌండ్ లో టీమిండియా దే లీస్ట్ స్కోరు. ఇక ఇవాళ టీ20 ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది.

మరోవైపు వన్డే సిరీస్ చిత్తుగా ఓడిపోయిందనుకున్న న్యూజిలాండ్… ఫస్ట్ టీ20 లో షాక్ ఇచ్చింది. ఏకంగా 219 రన్స్ చేసి టీమిండియా ముందు భారీ టార్గెట్ ఉంచింది. టార్గెట్ ఛేజ్ చేయలేక టీమిండియా చేతులెత్తేసింది. 80 రన్స్ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇలా ఊహించని షాక్ లిచ్చే కివీస్ ప్లేయర్స్ ఫైనల్ టీ20 లో ఎలా ఆడుతారో చూడాలి.

రోహిత్ శర్మ, ధావన్, ధోనీలు ఫామ్ లో ఉండటం టీమిండియాకు ప్లస్ పాయింట్. ఓపెనింగ్ కుదురుకుందంటే ఇండియాను కొట్టడం అంత ఈజీ కాదు. ఇక మిడిలార్డర్ లో విజయ్ శంకర్, పంత్, దినేష్ కార్తిక్ మెరుపులు ఉండనే ఉన్నాయి. పీక్ మూమెంట్లో మ్యాచ్ ఫినిష్ చేసేందుకు ధోనీ ఎప్పుడూ సిద్ధమే. కృనాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఎటు చూసిన అన్ని ప్లస్సులూ టీమిండియా వైపే ఉన్నాయి.

మరి కొద్ది రోజుల్లోనే వన్డే వరల్డ్ కప్ ఉండటంతో రెండు టీంలకు ఈ మ్యాచ్ కీలకమే. టోర్నీని గ్రాండ్ గా ముగించాలనే రెండు జట్లు కోరుకుంటున్నాయి. సండే మ్యాచ్ ఉండటంతో ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు.

ఇండియా, న్యూజిలాండ్ ల మధ్య మూడో టీ20 మధ్యాహ్నం 12:30లకు ప్రారంభం కానుంది.