OMG: బోరు బావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి

OMG: బోరు బావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి

తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వగా.. అక్కడే ఆడుకుంటున్న వారి ఏడాదిన్నర పాప బోరు బావిలో పడింది. 50 అడుగుల లోతులో చిక్కుకున్న ఆ చిన్నారి ప్రస్తుతం సహాయక బృందాలు పంపిన ఆక్సిజన్ పీల్చుతూ శ్వాస సాగిస్తోంది. ఈ ఘటన గుజరాత్, అమ్రేలిలోని సురగ్‌పరా గ్రామంలో చోటు చేసుకుంది. 

శుక్రవారం(జూన్ 14) మధ్యాహ్నం అమ్రేలిలోని సురగ్‌పరా గ్రామంలో ఓ బోరుబావిలో వ్యవసాయ కూలీలకు చెందిన ఏడాదిన్నర పాప(ఆరోహి) పడినట్లు అధికారులు తెలిపారు. 45-50 అడుగుల లోతులో బాలిక చిక్కుకున్నట్లు వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు హుటాహుటీన అక్కడకి చేరుకున్నాయి. కెమెరా సాయంతో చిన్నారి ఎన్ని అడుగుల్లో చిక్కుందో తెలుసుకున్నారు. అనంతరం ఆక్సిజన్ పైపులను కిందకు దించి చిన్నారికి శ్వాస అందిస్తున్నారు. బాలికను వీలైనంత త్వరగా బయటకే తెచ్చేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి.