రాజేంద్రనగర్​లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి : తోకల శ్రీనివాస్ రెడ్డి

రాజేంద్రనగర్​లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి : తోకల శ్రీనివాస్ రెడ్డి

శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్‌‌ సెగ్మెంట్​లో బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పించాలని ఆ పార్టీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి కోరారు.  శంషాబాద్‌ మండల పరిధిలోని జూకల్, చౌదరిగూడ, కాచారం గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా  బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..

 మూడుసార్లు బీఆర్‌‌ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్‌ను గెలిపించారని,  ఒక్కసారి బీజేపీకి  రాజేంద్రనగర్‌‌లో అవకాశం కల్పించాలని కోరారు.  ఎమ్మెల్యేగా గెలిపిస్తే జూకల్ గ్రామంలో ఇళ్లు లేని గ్రామస్థులకు 60 గజాల చొప్పున  ఇండ్ల  పట్టాలు ఇస్తానని ఆయన  హామీ ఇచ్చారు.