
శంషాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ సెగ్మెంట్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సిద్ధమా అంటూ బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సాతంరాయిలో ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. గల్లీ గల్లీ తిరుగుతూ జనాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో పట్టుమని 15 నిమిషాలు కూడా మాట్లాడలేని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు తగిన బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మరోవైపు రాజేంద్రనగర్ సెగ్మెంట్‌కు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు తోకల శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.