దేశానికి గోల్డ్ మెడల్ అందించే దాకా పోరాడుతూనే ఉంటా

దేశానికి గోల్డ్ మెడల్ అందించే దాకా పోరాడుతూనే ఉంటా

అస్సాం యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటింది. ఆడిన తొలి ఒలింపిక్స్ లోనే బ్రాంజ్ మెడల్ నెగ్గి దేశ కీర్తి ప్రతిష్టను పెంచింది. అలాంటి లవ్లీనా తన ఫ్యూచర్ గోల్స్ గురించి స్పందించింది. వచ్చే ఒలింపిక్స్ లో తప్పకుండా పతకం రంగు మారుస్తానని ధీమా వ్యక్తం చేసింది. 

'బాక్సింగ్ నేర్చుకోవడానికి 4 నుంచి ఐదేళ్లు పడుతుంది. కానీ నాకు మాత్రం 8 సంవత్సరాలు పట్టింది. ఒకవేళ నాలుగేళ్లలోనే నేర్చుకున్నా.. ఒలింపిక్స్ కు ప్రత్యేకంగా సన్నద్ధం కావడానికి మరో 4 సంవత్సరాలు పడుతుంది. దేశం తరఫున మెడల్ గెలిస్తేనే గుర్తింపు లభిస్తుంది. అందుకోసం నేను పోరాడుతూనే ఉంటా. వచ్చే ఒలింపిక్స్ లో భారత్ కు గోల్డ్ మెడల్ అందిస్తా. ఒలింపిక్ ఛాంపియన్ గా నిలవాలన్నదే నా డ్రీమ్' అని లవ్లీనా పేర్కొంది.