
ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు అజయ్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అజయ్ తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. పుణేలో జరగబోయే నెక్స్ట్ షెడ్యూల్ లో అజయ్ జాయిన్ కావుతున్నారు.
ఈ సినిమాలో అజిత్ కుమార్ తో పాటు మంజు వారియర్, జాన్ కొక్కెన్, వీర లు పూణే షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. కాగా, అజయ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. గోవా షెడ్యూల్ లో దాదాపు చిత్రీకరణ పూర్తి కానుంది . ఏకే 61గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది. బోణి కపూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.