కషాయం పేరుతో పాయిజన్.. ఏకంగా 8 నెలలు తాగించారు

కషాయం పేరుతో పాయిజన్.. ఏకంగా 8 నెలలు తాగించారు

టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తిపై విష ప్రయోగం జరిగిందట. అది కూడా దాదాపు ఎనిమిది నెలల పాటు జరిగిందని ఆయన చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీ చక్రవర్తి తనపై హత్యాయత్నం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఆ విషయం గురించి వివరించిన జేడీ చక్రవర్తి.. "నిజానికి నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు కానీ కొంత కాలంగా క్రితం నాకు ఉన్నట్టు ఉండి శ్వాస సంబంధ సమస్య మొదలైంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టం అయ్యింది. ఆ సమస్య గురించి చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాను. ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ చూపించుకున్నాను. అయినా పరిష్కారం దొరకలేదు. అప్పుడు ఒక నిర్మాత నాకు మంచి వైద్యం ఇప్పించారు. ఆ డాక్టర్ నాకు పరీక్షలు చేసి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావని అడిగాడు. నాకు అప్పుడు అర్థం అయ్యింది. నా శరీరంలోకి మత్తు పదార్థాలు ఎలా వెళ్లాయో” అని. 

ఎడిటింగ్‌ చేసేటప్పుడు నాకు కషాయం తాగే అలవాటు ఉండేది. ఒకసారి ఆ కాషాయం నాతోపాటు మరో వ్యక్తి కూడా తాగాడు. తరువాత  తాను అస్వస్థతకు గురయ్యాడు. ఇదే విషయాన్ని కషాయం తయారు చేసిన వ్యక్తికి చెప్తే.. నీ కోసం తయారు చేసిన కషాయం వేరేవాళ్లకు ఎందుకు ఇచ్చావని తిట్టాడు. అప్పుడు నాకు అర్థమైంది.. నేను రోజూ తీసుకున్న కషాయమే విషం అని" అయితే, విష ప్రయోగం ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు జేడీ.