నువ్వు అసలు మనిషివేనా.. రాహుల్పై ఫైర్ అవుతున్న నెటిజన్స్

నువ్వు అసలు మనిషివేనా.. రాహుల్పై ఫైర్ అవుతున్న నెటిజన్స్

ఒడిశా రైలు ప్రమాదాన్ని(odisha train accident) కామెడీ చేస్తూ టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ(Rahul ramakrishna) ట్వీట్ చేసాడు. ఈ విషయంపై రాహుల్ ను ఏకిపారేస్తున్నారు నెటిజన్స్. నువ్వు అసలు మనిషివేనా అంటూ మండిపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఒడిశా రైలు ప్రమాదంలో దాదాపు 250 మంది మరణించగా.. 900 మందికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. 

దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత సీరియస్ ఇష్యూని కామెడీ చేశాడు రాహుల్ రామకృష్ణ. హాలీవుడ్ లోని సైలెంట్ సినిమా ట్రైన్ సీన్ ను షేర్ చేశాడు. ఆ వీడియోలో ట్రైన్ ముందు కొంతమంది వ్యక్తులు విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఈ ట్వీట్ చుసిన నెటిజన్లు రాహుల్ పై విమర్శలు కురిపించారు. రైలు ప్రమాదంలో చాలా మంది మరణించారు, ఎంతోమందికి కడుపుకోతకు మిగిల్చింది. అలాంటి సంఘటనపై కామెడీ చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. నువ్వసలు మనిషివేనా.. ఇది కామెడీ చేసే సమయమా..? అంటూ మండిపడుతున్నారు. 

దీంతో వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసిన రాహుల్.. నెటిజన్స్ కు సారీ చెప్పాడు. ” నేను వేసిన ట్వీట్ కు క్షమాపణ చెప్తున్నా, ఈ ఘటన తగురించి నాకసలు తెలియదు, తప్పు జరిగింది.. ఒట్టేసి చెప్తున్నా ఇది కావాలని చేసింది కాదు ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాహుల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.