HBD Mahesh Babu: దైవం మహేష్ రూపేణ.. రియల్ సూపర్ స్టార్కి సినీ ప్రముఖుల బర్త్డే విషెస్..

HBD Mahesh Babu: దైవం మహేష్ రూపేణ.. రియల్ సూపర్ స్టార్కి సినీ ప్రముఖుల బర్త్డే విషెస్..

నటించడంలోనే కాదు.. సమాజ సేవ చేయడంలో అతనో సూపర్ స్టార్. దేవుడిచ్చిన అందంలోనే కాదు.. జీవితం నేర్పిన అనుభవాల్లో అతనో హెల్పింగ్ స్టార్. తన మనసుతో బాధలు అర్ధం చేసుకోగలడు. తన నిండు చేతులతో దగ్గరకి తీసుకుని కన్నీళ్లు తుడవగలడు. ఇంకా గొప్పగా చెప్పాలంటే.. ఎందరో చిన్నారులకి అభయం ఇస్తూ.. ఆయుష్షు పోసిన దేవుడతను. 4500కి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. ముందుకెళ్తున్న నిస్వార్ధ సేవకుడతను. అతనే మన టాలీవుడ్ సూపర్ స్థార్ మహేష్ బాబు (Mahesh Babu). ఇవాళ (2025 ఆగస్టు 9న) మహేష్ బాబు పుట్టినరోజు. 1975, ఆగష్టు 9న జన్మించిన మహేష్.. నేటితో 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని.. 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు.ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు (ఆగస్ట్ 9న) శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు చేశారు. 

ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు (ఆగస్ట్ 9న) శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు చేశారు. 

అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి.. ‘‘నా ప్రియమైన సూపర్ స్థార్ మహేష్ బాబుకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెలుగు సినిమాకు గర్వకారణం, మీరు ఈ విశ్వంలో అసాధారణమైన ప్రతిదీ జయించాలని నిర్ణయించుకున్నారు. అలాగే, ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ మీరు చిన్నవారవుతున్నట్లు కనిపిస్తోంది. మీకు అద్భుతమైన సంవత్సరంతో పాటు అనేక సంతోషకరమైన క్షణాలు పొందాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని చిరు తన విషెష్ తెలిపారు. 

మహేష్ బాబు తన సొంత అన్నయ్యగా భావించే వెంకటేష్ చెప్పిన విషెష్ ఆకర్షిస్తుంది. ‘‘నా ప్రియమైన సూపర్ స్టార్ మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజుతో నీకు 50 ఏళ్లు నిండుతాయి. కానీ నువ్వు ఎప్పటికీ నా చిన్నోడివే. నీ హాస్యం మరియు దయ చాలా మంది హృదయాల్లో వెలుగు నింపుతుంది. నిజంగా నీలాంటి వారు ఎవరూ లేరు. నవ్వుతూ ఉండు. ఎప్పటికీ నీవొక ప్రత్యేకమైన వ్యక్తివే. #SSMB29 లో ప్రపంచంతో నీ మాయాజాలాన్ని చూసే వరకు వేచి ఉండలేను” అని వెంకటేష్ తన ప్రేమను వ్యక్తపరిచారు.

మహేష్ బాబుకు ఎన్టీఆర్‌ తెలిపిన బర్త్‌ డే విషెష్కి ఇరువైపుల ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ అన్నా!! ఈ ఏడాది అంతా మీకు చాలా బాగుండాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను" అంటూ చేసిన పోస్ట్ సినీ ఆడియన్స్ను ఆకర్షిస్తుంది. మహేష్ బాబును అన్నా అంటూ సంభోదిస్తూనే..అంతా మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నా అని తెలపడం..ఒకరంటే ఒకరికి ఎంత ఇష్తమో..ఎలాంటి బంధమో చూపిస్తుంది.

నా ప్రియమైన సోదరుడు.. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని మ్యూజిక్ డైరెక్టర్ తన పోస్ట్ చేశారు.

ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో సినిమా చేస్తున్నాడు.  'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ మహేష్ బర్త్ డే స్పెషల్ గా ఏదైనా అప్డేట్ ఉండొచ్చనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇండస్ట్రీ అల్టిమేట్ క్లాసిక్ ఫిల్మ్  'అతడు' రీరీలిజ్ తో నేడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్లో హంగామా చేస్తున్నారు.