కళాతపస్వి పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు

కళాతపస్వి పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు

కళాతపస్వి కే విశ్వనాథ్‌ ఇకలేరు. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్ లో చనిపోయారు. దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. విశ్వనాథ్‌ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటులు కోటా శ్రీనివాస్ రావు, చంద్రమోహన్, మురళీ మోహన్, ఆర్ నారాయణమూర్తి, దర్శకులు బోయపాటీ, శేఖర్ కమ్ముల, తదితరులు నివాళులర్పించారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు : "విశ్వనాథ్ పరమదించడం చాలా విచారకరం. ఆయనకు నేను అభిమనిని. ఎన్నో అపురూప కళాఖండాలు సృష్టించి ప్రజలకు అందించారు. సమాజంలో మార్పును సృష్టిస్తూ ఎన్నో అధ్బుతమైన సినిమాలు ఆయన తీశారు. అస్లీలత, అసభ్యతకు తావు లేకుండా ఇంటిల్లిపాది చూసే సినిమాలను తీశారు విశ్వనాథ్".

చిరంజీవి: "విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నేను ఎంతో నేర్చుకున్ను.ఆయన సినిమాలు యువ దర్శకులకి గ్రంథాలయలు.ఆయన నాకు పితృసమానం. ఆయనతో నాకు పరిచయం ఏర్పడటం ఎవుడు ఇచ్చిన వరం. ఇంద్ర సినిమా వారణాసిలో షూటింగ్ అయ్యే టైంలో నా పక్కనే ఉన్నాడు.ఈరోజు శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది.అదే రోజు ఆయన మనకి దూరం అయ్యాడు".

ఆర్ నారాయణమూర్తి: " విశ్వనాథ్ శంకరాభరణం సినిమాతో ప్రపంచ సంగీతాన్ని శాశించిన మహనీయుడు. ఎన్నో అవార్డ్స్ అందుకున్న గొప్ప వ్యక్తి.తెలుగు సంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మంచి మనిషి.ఆయన మరణం తీవ్రమనస్థాపానికి గురిచేస్తుంది.ఆయన సినిమాలోనే నాకు మొదటి అవకాశం వచ్చింది.విశ్వనాథ్ లేని లోటుని ఎవరు తీర్చలేరు".