పవన్ కళ్యాణ్ "వారాహి"పై రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ "వారాహి"పై రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్స్

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై సెటైరికల్ కామెంట్స్ చేశారు.  పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచార వాహనం వారాహి పూజలు కొండగట్టులో జరిపించారు. ఈ నేపథ్యలో రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ  ట్విట్టర్ లో ఫోటోలు పోస్ట్ చేశారు.  పవన్ కళ్యాణ్ను స్వామి వివేకానందతో పోల్చిన ఆర్జీవీ... అలాంటి పవన్ కళ్యాణ్.. హిట్లర్ వ్యాన్ మీద నుంచి మాట్లాడుతున్నాడు అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

పవన్  కుడికాలిని హిట్లర్ నాకుతాడని.. ఎడమ కాలిని స్వామి వివేకానంద నాకుతాడని అలాంటి పవర్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.  పవన్ కళ్యాణ్ను వివేకానందతో పోలుస్తూ బలవంతుడైన వివేకానందుడు అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు.

ఆ రోజుల్లో రామారావు గారు "చైతన్య రథం" మీద తిరిగితే, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్ కింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్గా కుదరకపోతే కనీసం కేసులన్నా పెట్టించండి పవన్ గారూ, ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం అంటూ వర్మ ట్వీట్ చేశారు.

గుడిలో ఉంటే అది వారాహి.. రోడ్డు మీద ఉంటే అది పంది.. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే.. అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి, వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర వారాహి ని ఒక పంది బస్సు గా ముద్ర వేస్తారు. జై పీకే, జై జనసేన అంటూ వర్మ మరో ట్వీట్ చేశారు. 

ఆ వెంటనే డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi హ్యాష్‌ట్యాగ్ ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండని వర్మ ట్వీట్టర్లో పేర్కొన్నారు.