ఆ సినిమా వాళ్లందరూ మంచోళ్లు : డ్రగ్స్ కేసులు కొట్టివేసిన కోర్టు

ఆ సినిమా వాళ్లందరూ మంచోళ్లు : డ్రగ్స్ కేసులు కొట్టివేసిన కోర్టు

టాలీవుడ్‌  డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్ శాఖకు  నాంపల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.   8 కేసుల్లో ఆరు కేసులు కొట్టేసింది.  ఎఫ్ఎస్ ఎల్ నివేదిక ఆధారంగా కేసులు కొట్టేసింది. సరైన ఆధారాలు లేవని కేసులు కొట్టేసింది. ఎక్సైజ్ శాఖ సరైన ప్రొసీజర్ పాటించలేదని కోర్టు తెలిపింది.

2018లో  కొంత  మంది నటీనటులపై   కేసులు నమోదు చేసింది ఎక్సైజ్ శాఖ.  దీనిపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది. మొత్తం 8 కేసులు నమోదు చేసింది సిట్.  అప్పట్లో నెలల తరబడి పలువురి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ శాఖ విచారించింది.

 నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకలు, శాంపిల్స్ తీసుకుంది ఎక్సైజ్ శాఖ. శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తరుణ్‌ల శాంపిల్స్‌ మాత్రమే పరిశీలించింది ఎఫ్‌ఎస్‌ఎల్‌. అయితే వీళ్లిద్దరి శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని ఎఫ్ఎస్ఎల్ తేల్చింది. దీంతో సరైన సాక్ష్యాలు లేవని  8 కేసుల్లో 6 కేసులకు ఎలాంటి ఆధారాలు లేవని కొట్టేసింది.