
ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్. మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్‌కి జంటగా ఆమె నటించిన ‘హృదయం’ సినిమాలోని ‘దర్శన’ అనే పాట తెలుగులోనూ పాపులర్. ‘జయ జయ జయ జయహే’ అనే మరో మలయాళ చిత్రంతోనూ ఆకట్టుకున్న ఆమె.. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కబోతోంది.
అనుపమ పరమేశ్వరన్ ఇందులో నటించబోతున్నట్టు ఇటీవలే అనౌన్స్ చేసిన టీమ్, తాజాగా దర్శన రాజేంద్రన్ మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. విజయ్ శంకర్ డొంకాడ దీనికి నిర్మాత. ఇదొక ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో షూటింగ్ మొదలవనుంది.