కొల్లాపూర్, వెలుగు: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ శనివారం కొల్లాపూర్ మండలం సోమశిలలో సందడి చేశారు. కృష్ణా నదిలో ఫ్యామిలీతో కలిసి బోటులో షికారు చేశారు. నల్లమల అందాలను వీక్షించి అనుభూతి పొందారు. రెండు రోజుల నుంచి కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలో పారిశ్రామికవేత్త, మై హోం సంస్థ అధినేత రామేశ్వరావు ఇంట్లో రిలాక్స్ అవుతున్నట్టు సమాచారం. సోమశిలలో బోటులో షికారు చేసిన అనంతరం తిరిగి వెళ్లిపోయారు.
