మామూలు ఫాలోయింగ్ కాదిది

మామూలు ఫాలోయింగ్ కాదిది

ఒక సెలబ్రిటీ రేంజ్‌‌, క్రేజ్‌‌లు.. ఏపాటివో చెప్పడానికి  సోషల్ మీడియా ఇప్పుడొక రిఫరెన్స్‌‌గా మారింది. ఫేస్‌‌బుక్‌‌, ట్విటర్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌, స్నాప్‌‌చాట్..  ఇలా అకౌంట్స్‌‌ ఏవైనా సరే సెలబ్రిటీలు చేసే ఒక్క పోస్ట్‌‌ లక్షల మందికి రీచ్‌‌ అవుతోంది.  సినిమాల ప్రమోషన్‌‌, ముఖ్యంగా ఫ్యాన్స్‌‌కి చేరువయ్యేందుకు సినీ సెలబ్రిటీలకు ఇదొక మంచి ఫ్లాట్‌‌ఫామ్‌‌గా ఉపయోగపడుతోంది.  అయితే సినిమాల పరంగానే కాదు.. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, సోషల్ ఇష్యూస్‌‌పైనా వాళ్ల స్టాండ్ ఏంటో చెప్పడంలోనూ సోషల్ మీడియాదే ‘కీ’ రోల్‌‌.  అలాంటి  ఫ్లాట్‌‌ఫామ్స్‌‌లో దక్షిణాది హీరోల ఫాలోయింగ్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

మహేశ్ బాబు

టాలీవుడ్‌‌ సూపర్ స్టార్‌‌ మహేష్‌‌ బాబుకి మిగతా లాంగ్వేజ్‌‌ల్లోనూ ఫాలోయింగ్ చాలా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌‌గా ఉండే మహేష్‌‌.. సినిమాల ప్రమోషన్‌‌ కంటే పర్సనల్‌‌ విషయాల్ని ఎక్కువ పోస్ట్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు సోషల్ ఇష్యూస్‌‌పై కూడా రియాక్ట్‌‌ అవుతుంటాడు.

  • ట్విటర్‌‌లో 8.34 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌
  • ఫేస్‌‌బుక్‌‌లో 5.3 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌
  • ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 3.6 మిలియన్ ఫాలోయర్స్‌‌

ధనుష్‌‌

‘కాదల్ కొండెయిన్‌‌’తో కోలీవుడ్‌‌లో ఓవర్‌‌నైట్‌‌ స్టార్‌‌గా మారిన ధనుష్.. ఆ తర్వాత మిగతా లాంగ్వేజ్‌‌ల్లోనూ తన క్రేజ్‌‌ను విస్తరించుకున్నాడు.  యాక్టర్‌‌, ప్రొడ్యూసర్‌‌, డైరెక్టర్‌‌, రైటర్‌‌, లిరిసిస్ట్‌‌, ప్లేబ్యాక్ సింగర్‌‌.. ఇలా ‘మల్టీటాలెంట్‌‌ పర్సన్‌‌’గా స్పెషల్‌‌ స్టాంప్‌‌ వేయించుకున్నాడు ధనుష్.  దక్షిణాదిలోనే కాదు, ‘రాంజ్‌‌నా, షమితాబ్‌‌’ సినిమాలతో బాలీవుడ్‌‌లోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు.

  • ట్విటర్‌‌లో 8.65 ఫాలోయర్స్‌‌
  • ఫేస్‌‌బుక్‌‌లో 4.6 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌
  • ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఐదు లక్షల ఫాలోయర్స్‌‌

అల్లు అర్జున్‌‌

టాలీవుడ్ స్టైలిష్‌‌ స్టార్‌‌ అల్లు అర్జున్‌‌కి మిగతా సినీ ఇండస్ట్రీల్లోనూ మంచి క్రేజ్‌‌ ఉంది. ముఖ్యంగా మాలీవుడ్‌‌లో అర్జున్‌‌కి ఫ్యాన్‌‌ ఫాలోయింగ్ ఎక్కువ. స్టైలిష్‌‌ అప్పియరెన్స్‌‌, డ్యాన్సులకు వాళ్లు ఫిదా అయిపోయారు. అందుకే ఇక్కడ యావరేజ్‌‌గా ఆడిన సినిమాల్ని.. మలయాళంలో సూపర్‌‌ హిట్స్‌‌ చేస్తున్నారు. అంతేకాదు అల్లు అర్జున్‌‌ని ‘మల్లు అర్జున్‌‌’  అని ముద్దుగా పిలుచుకుంటారు.

  •  ట్విటర్‌‌లో 3.3 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌
  • ఫేస్‌‌బుక్‌‌లో 12 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌
  • ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 4.1 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌

దుల్కర్ సల్మాన్

మమ్ముట్టి నటవారసుడిగా మాలీవుడ్‌‌లో అడుగు పెట్టిన దుల్కర్‌‌.. తక్కువ టైంలోనే తనకంటూ ఓ ఐడెంటిటీని సంపాదించుకున్నాడు.  ముఖ్యంగా దుల్కర్‌‌కి లేడీ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. సౌత్ లాంగ్వేజ్‌‌లతో పాటు హిందీలోనూ ‘కార్వాన్‌‌, జోయా ఫ్యాక్టర్‌‌’ సినిమాలతో బాలీవుడ్‌‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్‌‌ను ఏర్పరుచుకున్నాడు.

  • ట్విటర్‌‌.. 1.8 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌
  •  ఫేస్‌‌బుక్‌‌లో 5.1 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌
  • ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 4 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌

ప్రభాస్‌‌

బాహుబలి ఇచ్చిన భారీ సక్సెస్‌‌ పాన్‌‌ ఇండియా–స్టార్‌‌గా మారిపోయాడు ప్రభాస్‌‌. తెలుగుతో పాటు దాదాపు అన్ని లాంగ్వేజ్‌‌ల్లో ఈ రెబల్‌‌ స్టార్​కి ఫ్యాన్స్ ఉన్నారు.  చాలా కాలం పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు ప్రభాస్‌‌. అయితే అకౌంట్స్ ఓపెన్‌‌ చేయగానే లక్షల్లో ఫ్యాన్స్‌‌ ఫాలో అవ్వడం విశేషం.

  • ట్విటర్‌‌.. వెరిఫైడ్‌‌ అకౌంట్ లేదు
  • ఫేస్‌‌బుక్‌‌లో 10.2 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌
  • ఇన్‌‌స్టాలో 3.9 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌

విజయ్ దేవరకొండ

‘పెళ్లి చూపులు, అర్జున్‌‌ రెడ్డి’తో టాలీవుడ్‌‌లో సెన్సేషన్ స్టార్‌‌ అయ్యాడు విజయ్‌‌ దేవరకొండ. ఆటిట్యూడ్‌‌తో ఎప్పుడు ఇన్‌‌న్యూస్‌‌లో, సోషల్ మీడియాలో ఉండే ఈ ‘రౌడీ హీరో’కి యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అర్జున్‌‌ రెడ్డితో ఏర్పడ్డ ఫాలోయింగ్ వేరే లాంగ్వేజ్‌‌ల్లోకి కూడా చేరిందంటే అతిశయోక్తి కాదు.

  • ట్విటర్‌‌లో 9 లక్షలపైన ఫాలోయర్స్‌‌
  • ఫేస్‌‌బుక్‌‌లో 1. 2 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌
  • ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 4.6 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌

కుర్ర హీరోలతో పోటీగా..
సీనియర్ హీరోల్లో చాలా మంది సోషల్ మీడియాలో  రెగ్యులర్‌‌గా యాక్టివ్‌‌గా ఉంటున్నారు. అప్‌‌డేట్స్‌‌ విషయంలో యంగ్‌‌స్టర్స్‌‌తో పోటీ పడుతూ పోస్టులు పెడుతున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్‌‌ రజనీకాంత్‌‌కి ట్విటర్‌‌లో 5.54 మిలియన్‌‌, ఫేస్‌‌బుక్‌‌లో రెండు లక్షల ఫాలోయర్స్‌‌ (కిందటేడాది నుంచి ఒక్క పోస్ట్‌‌ కూడా లేదు), ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో నాలుగు లక్షలకు పైగా ఫాలోయర్స్‌‌ ఉన్నారు.  మాలీవుడ్ సూపర్‌‌స్టార్‌‌ మోహన్‌‌లాల్‌‌కి ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 1.9 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌, ట్విటర్‌‌లో 5.88 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌, ఫేస్‌‌బుక్‌‌లో 4.9 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌ ఉన్నారు.  మమ్ముట్టి ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో 1.2 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌, ఫేస్‌‌బుక్‌‌లో 3.8 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌, ట్విటర్‌‌లో 1.06 మిలియన్‌‌ ఫాలోయర్స్‌‌ ఉన్నారు.  నాగార్జున అక్కినేని, వెంకటేష్‌‌, బాలకృష్ణ, జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌, రాంచరణ్, రానా దగ్గుబాటి, నితిన్‌‌, నిఖిల్‌‌,  కోలీవుడ్ హీరోలు కమల్ హాసన్‌‌, సూర్య, మాలీవుడ్‌‌లో పృథ్వీరాజ్ సుకుమారన్‌‌,  కన్నడలో ఉపేంద్రకి సోషల్‌‌ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ.  ‘కిచ్చా’ సుదీప్‌‌, యశ్‌‌, దర్శన్‌‌, పునీత్ రాజ్‌‌కుమార్‌‌లు ఆ తర్వాతి పొజిషన్‌‌లో ఉన్నారు.