అమరావతి ఎంపీగా టాలీవుడ్ హీరోయిన్

అమరావతి ఎంపీగా టాలీవుడ్ హీరోయిన్

ఇప్పటి వరకు పార్లమెంట్ లో సినిమా రంగంనుంచి వచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో మరొకరు చేరిపోయారు. ఆమె ఎవరో కాదు… శ్రీను వాసంతి లక్ష్మి అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పంజాబీ బ్యూటీ నవనీత్ కౌర్. శ్రీను వాసంతి లక్ష్మి, శత్రువు, మహాదేవ వంటి కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో మంచి బ్రేక్ రాలేదు. ఆ తర్వాత  కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. అక్కడా ఆమెకు కలిసిరాలేదు. దీంతో మహారాష్ట్ర వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. అదే టైంలో ఆ రాష్ట్రానికి చెందిన రవిరాణా అనే రాజకీయ నాయకుడిని వివాహం చేసుకుంది.

రవిరాణా స్వాభిమాన్ పార్టీ నాయకుడు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా, ఈ పార్టీ నుంచి నవనీత్ కౌర్ 2019 ఎన్నికల్లో అమరావతి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేసింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంటే… దానిని తట్టుకొని నిలబడి అమరావతి నుంచి విజయం సాధించింది నవనీత్ కౌర్. ఎంపీగా మొదటిసారి పార్లమెంట్ లోకి అడుగుపెట్టబోతున్నారు.