
కోలీవుడ్ హీరోయిన్ అతుల్య రవి(Athulya Ravi) ఇప్పుడు టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తో ‘మీటర్’ అనే సినిమాలో మెరిసింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గుర్తింపు రాలేదు. కానీ, ఇప్పుడు ఈ బ్యూటీ మరోసారి యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. అతుల్య తాజా ఫొటో షూట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోల్లో ఈ నటి గ్లామర్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
2017లోనే అతుల్య సినీ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఓవర్‌నైట్ పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాల్లో నటించినా దక్కాల్సినంత గుర్తింపు మాత్రం రావడం లేదని ఫీలవుతోందట. దీంతో ఇప్పుడు టాలీవుడ్లో ఆఫర్ల కోసం చూస్తోందని టాక్. ఓ యాంగిల్లో అంజలిలా.. మరో యాంగిల్లో కాజల్ అగర్వాల్లా ఉండే ఈ హీరోయిన్ లుక్స్ యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఒక్క హిట్టు పడితే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటున్నారు సినీ ఫ్యాన్స్.