వనస్థలిపురంలో గుమాస్తాగా పార్ట్ టైమ్ జాబ్.. ఫిల్మ్నగర్ ఎంట్రీతో సినిమాల్లో స్టార్ లిరిసిస్ట్

వనస్థలిపురంలో గుమాస్తాగా పార్ట్ టైమ్ జాబ్.. ఫిల్మ్నగర్ ఎంట్రీతో సినిమాల్లో స్టార్ లిరిసిస్ట్

‘100%’ మూవీతో లిరిసిస్ట్‌‌గా పరిచయమైన శ్రీమణి (Shreemani) తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. టాలీవుడ్‌‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. పలువురు స్టార్ హీరోలకు సూపర్ హిట్ సాంగ్స్‌‌ అందించిన శ్రీమణి పుట్టినరోజు ఇవాళ సోమవారం (సెప్టెంబర్ 15).

ఈ సందర్భంగా శ్రీమణి మాట్లాడుతూ ‘ఈ ఏడాది  సాహిత్య పరంగా లోతైన సన్నివేశాలకు సాంగ్‌‌లు అందించే అవకాశం నాకు లభించింది. ముఖ్యంగా ‘తండేల్‌‌’లో బుజ్జితల్లి, హైలెస్సా పాటలతో పాటు ‘లక్కీ భాస్కర్‌‌’లోని నిజమా కలా, ఆయ్‌‌ సినిమాలోని పాటలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ పాటలన్నీ కథలో ఉన్న సన్నివేశం తాలూకా లోతైన భావం చెప్పడమే.

నాకు ప్రతి పాటకు ఏదో ఒక చాలెంజ్‌‌ ఉంటుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో సంగీతంతో పాటు సాహిత్యంలో సౌండ్‌‌ డిజైనింగ్ మారింది. శబ్ధ సౌందర్యం ఆడియెన్స్‌‌ను ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే నేను ట్రెండ్‌‌కు తగ్గట్టుగా, స్టాండర్స్‌‌ మిస్‌‌ అవ్వకుండా, పాటకు కాలపరిమితి లేకుండా అంటే పదేళ్ల తరువాత కూడా సాహిత్యం ఫ్రెష్‌‌గా అనిపించేలా ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగానే నన్ను నేను మార్చుకుంటాను.

మనం రాసిన పాట గురించి మనం గౌరవించే వ్యక్తులు, ఆరాధించే వ్యక్తులు గొప్పగా చెప్పినప్పుడు బాగా సంతృప్తి దొరుకుతుంది. నన్ను గేయ రచయితగా పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్‌‌ గారు 'గీతా గోవిందం' సినిమాలో వచ్చిందమ్మా పాట గురించి బాగా మెచ్చుకున్నారు. అది నాకు గొప్పగా అనిపించింది.

మహర్షి పాట విని సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి గొప్ప వ్యక్తి అభినందించడం నా జీవితంలో మరిచిపోలేను. రచన అంటే నాకు ప్రాణం. సాహిత్యం విలువ పెంచాలి అనేది నా కోరిక’ అని చెప్పారు. 

శ్రీమణి సినీ ప్రయాణం:

శ్రీమణి స్వస్థలం ప్రకాశం జిల్లా, చీరాల. 15 September 1988లో జన్మించారు. ఆయన అసలు పేరు పాగోలు గిరీష్. అతనికి శ్రీ అనే పదం ఇష్టం కావడంతో తల్లిపేరులోని మణితో కలిపి శ్రీమణి అని పేరు మార్చుకున్నాడు. తండ్రి పాగోలు వెంకటాచలం. శ్రీమణికి ఎనిమిదేళ్ళ వయసు ఉన్నప్పుడే, తండ్రి చనిపోయాడు.

శ్రీమణి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే, తాను రాసిన పాటల పుస్తకం తీసుకుని గేయరచయితగా అవకాశాల కోసం హైదరాబాదుకు వచ్చాడు. పాటల రచయితగా ప్రయత్నాలు చేస్తూనే హైదరాబాదులోని వనస్థలిపురంలో 2006 జూన్ నుంచి డిసెంబరు దాకా క్రాంతి ట్రాన్స్ పోర్టు కంపెనీలో గుమాస్తాగా పార్ట్ టైమ్ ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఓ స్నేహితుడి సలహాతో ఫిల్మ్ నగర్కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశ్యంతో 2007లో యూసఫ్ గూడాకి వెళ్ళి తన సినీ ప్రయత్నాలు మొదలెట్టాడు.

►ALSO READ | Ananya Panday: కార్తీక్ ఆర్యన్‌‌తో ‘లైగర్’ బ్యూటీ అనన్య.. మా ప్రేమ మొదలవుతుందని పోస్ట్

ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్ దగ్గరికే వెళ్లే మార్గం ఎంచుకుని, చివరికి 100%లవ్తో అవకాశం సంపాదించుకున్నాడు. ఇందులో ఏకంగా 3 పాటలు రాసే ఛాన్స్ దక్కించుకుని వరుస సినిమాలు అందిపుచ్చుకున్నారు శ్రీమణి. ఇలా దాదాపు ఆయన కెరీర్‌లో 300 కంటే ఎక్కువ పాటలు రాసి స్టార్ డమ్ కొనసాగిస్తున్నారు. 

శ్రీమణి సినిమాలు:

100% లవ్, సెగ,  బాడీగార్డ్, లవ్ ఫెయిల్యూర్, జులాయి, అత్తారింటికి దారేది (ఆరడుగులాబుల్లెట్టు), s/0 సత్యమూర్తి, అజ్ఞాత వాసి, MCA, రారండోయ్ వేడుక చూద్దాం, నేనులోకల్, తొలిప్రేమ, ఖైదీno150, మజ్ను, Mr.మజ్ను, గీతగోవిందం, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, ఆయ్, బాబు బంగారం, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, రంగ్ దే, ఉప్పెన, దసరా, లక్కీ భాస్కర్, తండేల్, పతంగ్, చావా వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాసి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీమణి. 

శ్రీమణి అవార్డులు:

అహో బాలు (100%లవ్) పాటకు డెబ్యూట్ గీత రచయితగా రేడియో మిర్చి అవార్డు, 
ఉత్తమ గీత రచయితగా అరడుగుల బుల్లెట్టు పాటకు ఫిలిం ఫేర్ అవార్డు
ఉత్తమ గీత రచయితగా శతమానంభవతి మూవీలో మెల్లగా తెల్లారిందోయ్ పాటకు సాక్షి అవార్డ్