
‘లైగర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే.. బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో మెప్పిస్తోంది. ఇటీవల ‘కేసరి చాప్టర్-2’ చిత్రంతో హిట్ అందుకున్న ఆమె.. ప్రస్తుతం ‘తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తు మేరీ’ చిత్రంలో నటిస్తోంది.
ఇందులో కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా కనిపించబోతోంది అనన్య. సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 31న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుందని ప్రకటించారు.
ఈ సందర్భంగా కార్తీక్ ఆర్యన్‌తో కలిసున్న మూవీ స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనన్య.. ‘ఈ సంవత్సరం మీ చివరి రోజును మాతో గడిపేందుకు సిద్ధంగా ఉండండి. సంవత్సరం ముగుస్తుంది.. మా ప్రేమ మొదలవుతుంది’ అని పోస్ట్ చేసింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
అయితే అనూహ్యంగా ఈ సినిమాను ప్రీ పోన్ చేస్తూ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జాకీ ష్రాఫ్, నీనా గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పతి పత్నీ ఔర్ ఓ’ తర్వాత అనన్య, కార్తీక్ కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.