జనసేనలో చేరిన టాలీవుడ్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్

జనసేనలో చేరిన టాలీవుడ్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన  పార్టీ ఆఫీస్ లో ఆయనకు పవన్ కళ్యాణ్   కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ సడెన్ గా జనసేనలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీలో ఆయన పార్టీ కార్యకర్తగా ఉంటారా? లేక ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారా చూడాలి.

బీవీఎస్ ఎన్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమా తీశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇటీవలే సాయిథరమ్ తేజ్ తో విరూపాక్ష మూవీ తీసి హిట్ కొట్టారు. వైష్ణవ్ తేజ్ తో రంగరంగవైభవంగా నిర్మించారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో గాండీవధారిఅర్జున మూవీ తీస్తున్నారు.