
ఉస్తాద్ రామ్(Ustaad Ram), మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ స్కంద (Skandha).ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక లేటెస్ట్గా స్కంద నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
అదేంటంటే డైరెక్టర్ బోయపాటి ముందుగా స్కంద స్టోరీని మరో టాలీవుడ్ స్టార్కు వినిపించాడట. బోయపాటి ఆ స్టార్ హీరోను ఊహించుకుంటూ స్టోరీని డెవెలప్ చేశాడని సమాచారం. ఇంతకీ ఆ స్టార్ ఎవరు అనుకుంటున్నారా..సూపర్ స్టార్ మహేష్ బాబు అంట.ఇక కంప్లీట్ స్టోరీని మహేష్కు వినిపించిన తరువాత..ఇంతటీ మాస్ యాంగిల్లో ఉన్న స్కంద స్టోరీ..తనకి సెట్ అవ్వదని బోయపాటికి చెప్పడట మహేష్. ఇదే న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.ఇక రామ్ కి స్టోరీ చెప్పడంతో సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చెప్పినట్టు సమాచారం. స్కంద రామ్కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
రీసెంట్గా స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా జరుపుకుంది. బాలకృష్ణ గెస్ట్ గా వచ్చి స్కంద టీంకి బూస్ట్ ఇచ్చారు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి నుండి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా..శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.