
టాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకండా, చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సాధించిన సినిమా బేబీ(Baby). దర్శకుడు సాయి రాజేష్(Sai rajesh) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya), విరాజ్ అశ్విన్(Viraj ashwin) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కు కుర్రకారు బాగా కనెక్ట్ అయ్యారు. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.90 కోట్లకు పైగా రాబట్టి చిన్న సినిమాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా సమాచారం మేరకు బేబీ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుందట. తెలుగు వర్షన్ ను డైరెక్ట్ చేసిన సాయి సాయిరాజేష్ హిందీ వర్షన్ కు కూడా దర్శకత్వం వచించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కుమారుడు ఆర్యమాన్ హీరోగా చేయనున్నాడట. హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయినే తీసుకుంటున్నారట. త్వరలోనే ఈ రీమేక్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మరి తెలుగులో భారీ విజయం సాదించిన బేబీ సినిమా హిందీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.
Also Read :-ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న శ్రీదివ్య.. అబ్బాయి ఎవరో తెలుసా?