Cannes2025: కేన్స్‌లో 62 ఏళ్ల టామ్‌ క్రూజ్‌ మెరుపులు.. అభిమానుల 5 నిమిషాల స్టాండింగ్‌‌‌‌ ఒవేషన్

Cannes2025: కేన్స్‌లో 62 ఏళ్ల టామ్‌ క్రూజ్‌ మెరుపులు.. అభిమానుల 5 నిమిషాల స్టాండింగ్‌‌‌‌ ఒవేషన్

ఫ్రాన్స్‌‌‌‌లో జ‌‌‌‌రుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ సూప‌‌‌‌ర్ ఎంట్రీ ఇచ్చారు. ఓ  స్టైలిష్ బైక్‌‌‌‌పై రెడ్ కార్పెట్‌‌‌‌ వద్దకు ఆయన గ్రాండ్‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చారు. తన కొత్త చిత్రం “మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్ రికనింగ్” ప్రీమియర్ సందర్భంగా కేన్స్‌‌‌‌లో 62 ఏళ్ల టామ్ క్రూజ్ ఇలా ఆశ్చర్యపరిచారు.

‘టాప్‌‌‌‌ గన్‌‌‌‌: మావెరిక్‌‌‌‌’తర్వాత మళ్లీ మూడేళ్లకు టామ్ క్రూజ్‌‌‌‌ తన కొత్త చిత్రం ప్రీమియర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నారు. బుధవారం గ్రాండ్ థియేటర్ లూమియర్‌‌‌‌లో ‘మిషన్: ఇంపాజిబుల్ –ది ఫైనల్ రికనింగ్’ప్రీమియర్ తర్వాత టామ్ క్రూజ్‌‌‌‌కు ఐదు నిమిషాల పాటు స్టాండింగ్‌‌‌‌ ఒవేషన్‌‌‌‌ లభించడం విశేషం.

ఈ అపూర్వమైన స్పందనకు క్రూజ్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చప్పట్ల మధ్య కిక్కిరిసిన థియేటర్ నుండి ఆయన బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాలో మూడు నిమిషాలపాటు టామ్ క్రూజ్‌‌‌‌ కత్తులతో పోరాడే యాక్షన్‌‌‌‌ సీన్‌‌‌‌ ఉందని, అది ప్రేక్షకులకు ఆశ్చర్యపరచబోతోందని  సమాచారం. హాలీవుడ్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ ఫ్రాంచైజీల్లో ‘మిషన్ ఇంపాజిబుల్‌‌‌‌’కు అంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది.

ముప్ఫై ఏళ్లుగా ఎథాన్‌‌‌‌ హంట్ పాత్రలో క్రూజ్ నటిస్తున్నారు. 1995లో సిరీస్‌‌‌‌ ప్రారంభం కాగా చివరిభాగంగా ఇప్పుడు 8వ సినిమా వస్తోంది. క్రిస్టోఫర్ మెక్‌‌‌‌క్వారీ దీనికి దర్శకుడు. హేలీ అట్వెల్, సైమన్ పెగ్, హన్నా వాడింగ్‌‌‌‌హామ్, ఏంజెలా బాసెట్, ఎసై మోరేల్స్, పోమ్ క్లెమెంటిఫ్, గ్రెగ్ టార్జాన్ డేవిస్ ఇతర పాత్రలు పోషించారు.  ఇంగ్లీష్‌‌‌‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మే 17న ఈ చిత్రం విడుదల కాబోతోంది.