హాలీవుడ్ నటుడైన టామ్ క్రూజ్‌కి ఇండియాలో మంచి ఫాలోయింగే ఉంది. టామ్ క్రూజ్ నటుడే కాదు నిర్మాత కూడా. మిషన్ ఇంపాజిబుల్-, మైనారిటీ రిపోర్ట్-, ది లాస్ట్ సమురాయ్,- వార్ ఆఫ్ ది వరల్డ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా టామ్‌కి మంచి పేరు సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా 1996లో మొదలైన ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా హవా 2018లో రిలీజైన ‘మిషన్ ఇంపాజిబుల్ ఫాలవుట్’ వరకూ కొనసాగింది. కంప్యూటర్ విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యత తక్కువ ఇచ్చి, యాక్షన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. ఆ సినిమా టామ్ క్రూజ్ చిత్రాల కలెక్షలన్నింటినీ బ్రేక్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా టామ్ ‘టాప్ గన్ 2’ సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా1986లో వచ్చిన ‘టాప్ గన్’ సినిమాకి సీక్వెల్. టామ్ హీరోగా టోనీ స్కాట్ డైరెక్షన్లో తెరకెక్కింది. కంప్లీట్ యాక్షన్ డ్రామా అయిన ఈ సినిమాలో టామ్ ఋనేవెల్ ఫ్లైట్ ఆఫీసర్ మావెరిక్‌గా యాక్షన్ అదరగొట్టేశాడు. దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నాడు. దీనికి ప్రొడ్యూసర్ కూడా టామే. ఇందులో టామ్ ఫ్లైట్ ట్రైనర్‌గా కనిపించనున్నాడు. రియల్ లైఫ్‌లో కూడా టామ్ మంచి పైలెట్. తన ఫ్లైట్‌ని తనే నడుపుకుంటాడు కూడా. అందుకని ఆ రోల్‌ని ఎంచుకుని ఉండొచ్చు. గ్లెన్ పావెల్‌తోపాటు మైల్స్ టెల్లర్,- జెన్నీఫర్ కాన్నేల్లీ, జాన్ హమ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జోసెఫ్ కొసిన్‌స్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్‌లో విడుదల కానుంది.
