
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వరుస పెట్టి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి పార్టీలో చేరేందుకు ఒకే చెప్పారు. గతంలో షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలువురు నేతలతో కలిసి కేటీఆర్ ను కలిసిన ఆయన..గురువారం టీఆర్ఎస్ లో చేరనున్నారు.