రేపు టీమిండియా, జింబాబ్వే మ్యాచ్.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోహిత్ సేన

రేపు టీమిండియా, జింబాబ్వే  మ్యాచ్.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోహిత్ సేన

టీమిండియా, జింబాబ్వే మధ్య జరిగే టీ20 మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం మెల్ బోర్న్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో గెలిచి సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. లాస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచి ఫుల్ జోష్ లో టీమిండియా ఉంది. అయితే టీమిండియాలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. టీమిండియా ఓపెనింగ్ మెరుగుపడలేదు. వరల్డ్ కప్ లో ఇంతవరకు రోహిత్ - రాహుల్ కలిసి మంచి పార్ట్నర్ షిప్ నమోదు చేయలేదు.

మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ, సూర్యకుమార్ మినహా ఏ ప్లేయర్ రాణించటం లేదు. టీమ్ సమిష్టిగా రాణిస్తే టీ20 వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ ఉందని అభిమానులు అంటున్నారు. రేపటి మ్యాచ్ కోసం రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇవాళ విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ప్రాక్టీస్ సెషన్ లోనే కేక్ ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసిన కోహ్లీ సహచరులతో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.