అందుకే ప్లీనరీని వాయిదా వేశాం: కోదండరామ్

అందుకే ప్లీనరీని వాయిదా వేశాం: కోదండరామ్

రేపు తెలంగాణ జన సమితి ప్లీనరీని జరుపనున్నట్లు తెలిపారు ఆపార్టీ చీఫ్ కోదండరామ్. ఈరోజు పార్టీ ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… సభ ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని పర్మిషన్లను తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల కారణంగా ప్లీనరీని రెండునెలలు వాయిదా వేయాల్సివచ్చిందని చెప్పారు. రేపు జరిగే ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక, ప్రతినిధుల సభ, ముగింపు సమావేశం జరుగనున్నట్లు తెలిపారు.

ప్లీనరీలో ప్రొ. యోగేంద్ర యాదవ్ కీలకోపన్యసం చేయనున్నట్లు తెలిపారు కోదండరామ్. ఆరు అంశాలపై తీర్మాణాలు ఉంటాయని.. అవి.. విద్య, వైద్యం, వ్వవసాయం, సామాజిక మహిళా సాధికారత, ఉద్యోగ ఉపాది తోపాటు పార్టీ భవిష్యత్ నిర్మాణం ఉండనుందని చెప్పారు. అటవీ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, రైతుల సమస్యలపై పార్టీ పోరాడుతుందని అన్నారు.

నిరంకుశ పాలనకు చమరగీతం పాడాలనే తాము పొత్తు పెట్టుకోవాల్సివచ్చిందని అన్నారు కోదండరామ్. రాజకీయాలలో మార్పు తీసుకురావడానికే పార్టీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముందస్తు ఎన్నికల్లో పొత్తులు ఫలించలేదని… పార్టీలు బాహుబలి కోసం వెతికారని.. నిజమైన బాహుబలి ప్రజలేనని అన్నారు. జరిగిన తప్పులు గుర్తించామని మళ్లీ వాటిని రిపీట్ కాకుండా చూస్తామని చెప్పారు కోదండరామ్.