జాతీయ సమైక్యతా దినోత్సవంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

జాతీయ సమైక్యతా దినోత్సవంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న (శనివారం) జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలకు సెలవు రోజుగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ శనివారం సెలవు దినంగా ప్రకటించింది. యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలకు ఇది వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. సెలవు నేపథ్యంలో.. ఇవాళ జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ప్రకటించారు. ఎగ్జామ్ రీ షెడ్యూల్ డేట్ను ప్రకటించనున్నారు. మరోవైపు సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరపనున్న జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని చెప్పారు.