
- రేవంత్‌కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంస
- విజన్‌కు సహకరిస్తామని లేఖ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్- 2047 విజన్ అద్భుతమని సీఎం రేవంత్ రెడ్డిని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. ఈ మేరకు సీఎంకు ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్‌తో సమావేశమైన రేవంత్.. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 గురించి ఆయనకు వివరించారు.
ఈ నేపథ్యంలో టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ (టీబీఐజీసీ), తెలంగాణ మధ్య అవగాహన ఒప్పందం కుదరగా.. రైజింగ్ విజన్ రూపకల్పన, అమలుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను ఇరు పక్షాల ప్రతినిధులు మార్చుకున్నారు. దీంతో తెలంగాణ రైజింగ్ 2047 తనను ఆకట్టుకుందని, ఈ విజన్‌కు సహకరిస్తామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.