
ఓవర్ మేకప్ చేస్తే ఇలాగే ఉంటది.. లేడీస్ అందంగా కనిపించేందుకు మేకప్ చేసుకోవడం ఈ రోజుల్లో సహజం. కానీ అది ఓవర్ అయితే జరిగే పరిణామాలకు ఇది ఉదాహరణగా చెప్పొచ్చు. ఓవర్ మేకప్ తో ఓ మహిళకు ఎయిర్ పోర్టులో ఎదురైన విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది..వివరాల్లోకి వెళితే..
మహిళలు మేకప్ చేసుకోవడం సర్వసాధారణం. అందంగా కనిపించేందుకు రకరకాల మేకప్ లు వేసుకుంటారు..వేయాల్సిన మోతాదుతో మేకప్ వేస్తే బాగుంటుంది..చూడటానికి గుడ్ లుక్ కనిపిస్తుంది..కానీ అదే మేకప్ ఓవర్ అయితే మాత్రం నవ్వుల పాలు కావాల్సిందే.. ఇదే జరిగింది చైనాలో ఓ మహిళకు.షాంఘై లోని విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ దగ్గర తన మేకప్‌ను తొలగించుకోవాల్సి వచ్చింది. ముఖ గుర్తింపు స్కానర్లు ఆమె పాస్‌పోర్ట్‌లోని ఫోటోతో ఆమె ముఖం ఆకృతిని సరిపోల్చలేకపోయాయి. ఇది కాస్త నెట్టింట వైరల్ అయింది.
సోషల్ మీడియాలో వేలాది మందిని ఆకట్టుకన్న ఈ వీడియోలో ఆ మహిళ చివరికి తన బ్రైడల్ లెవెల్ మేకప్ ను తొలగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇంతలా మేకప్ ఎందుకు వేసుకున్నవమ్మా అని ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తిడుతున్నట్లు కనిపిస్తుంది. "నీ పాస్‌పోర్ట్ ఫోటోలా కనిపించే వరకు అన్నీ తుడిచివేయి" అని ఆ వ్యక్తి చెప్పడం వినిపిస్తుంది. ఎయిర్ పోర్టులోని స్కానర్ గుర్తుపట్టకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందన రకరకాలుగా ఉంది. ‘‘ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి కనికరం లేదు గురూ.. అది సాదారణ మేకప్ కాదు.. కాస్ట్ లీ’’ అంటూ ఓ నెటిజన్ చమత్కరించాడు. ‘‘ఇంత జరిగినా ఆమె మేకప్ వేయకుండా ఉంటుందా’’ మరో నెటిజన్ హాస్యంగా రాశారు.
ఇంకో నెటిజన్ స్పందిస్తూ..‘‘వీడియో తీసిన సిబ్బందిని తప్పుబట్టాడు.. ఇప్పటికే ఆమె సిగ్గుపడుతోంది.. ఇంకా వీడియో తీసి బూమర్ లాగా వేధించాల్సిన అవసరం లేదు’’ అని రాశాడు.
ఇలా నెట్టింట ఆడవాళ్ల మేకప్ పై పెద్ద చర్చ సాగింది. ఇది చూసైనా ఆడవాళ్లు మేకప్ విషయంలో జాగ్రత్తగా ఉంటారో లేదో చూడాలి.