టెట్​ నిబంధనల్లో చాలా లోపాలు!

టెట్​ నిబంధనల్లో చాలా లోపాలు!

తెలంగాణ ప్రభుత్వం టెట్​నోటిఫికేషన్​కు ఏర్పాట్లు చేస్తోంది. టెట్​ నిబంధనల్లో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సవరించిన తర్వాతే టెట్​పెట్టాలి. జాతీయ ఉపాధ్యాయ శిక్షణా మండలి(ఎన్​సీటీఈ) నిబంధనల ప్రకారం.. డీఎడ్, డిగ్రీ పూర్తి చేసిన వారికి టెట్​పేపర్​2లోనూ అవకాశం ఇవ్వాలి. ఈ రూల్​ప్రకారమే సెంట్రల్​టెట్​లో అవకాశం కల్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాలుగు సార్లు అవకాశం కల్పించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత  రెండు సార్లు నిర్వహించిన టెట్​లో అధికారుల తప్పిదాల వల్ల డిగ్రీ, డీఎడ్​చేసిన వారికి పేపర్​2లో అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించే టెట్​పేపర్​2లో చాన్స్​ఇవ్వాలి. దీంతోపాటు పేపర్​2లో బయాలజీ అభ్యర్థులకు అసలు సంబంధమే లేని గణితం నుంచి అధిక ప్రశ్నలు వస్తున్నాయి.  దీని వల్ల ఎక్కువ మంది బయాలజీ అభ్యర్థులు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయలేక తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి వారికి గణితం ప్రశ్నల నుంచి విముక్తి కల్పించాలి. ఉపాధ్యాయ శిక్షణలో ఉన్న చివరి సంవత్సరం విద్యార్థులకూ టెట్​రాసే వెసులుబాటు కల్పించాలి. త్వరలో పెట్టబోయే టెట్ కు డీఎడ్, బీఎడ్​ సెకండ్​ఇయర్​ చదువుతున్న స్టూడెంట్లను అనుమతించాలి. 
- రావుల రామ్మోహన్​రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, డీఎడ్, బీఎడ్​ అభ్యర్థుల సంఘం