Term Policy: టర్మ్‌‌‌‌‌‌‌‌ పాలసీతో ఎన్నో ప్రయోజనాలు.. టర్మ్ పాలసీ ఎందుకు బెటర్ అంటే ?

Term Policy: టర్మ్‌‌‌‌‌‌‌‌ పాలసీతో ఎన్నో ప్రయోజనాలు.. టర్మ్ పాలసీ ఎందుకు బెటర్ అంటే ?
  • సింపుల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది..సేఫ్‌‌‌‌‌‌‌‌ కూడా
  • యంగ్ ఏజ్‌‌‌‌‌‌‌‌లో తీసుకుంటే తగ్గనున్న ప్రీమియం
  • పిల్లల చదువులు, లోన్లు వంటి బాధ్యతలు ఉంటే ఉపయోగం
  • టెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వీటి  ఆధారంగా సెలెక్ట్ చేసుకోవాలంటున్న నిపుణులు 
  • పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకి పరిహారం

న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ పాలసీ తీసుకోవాలని చూస్తున్నారా?  కానీ దీని గురించి పెద్దగా క్లారిటీ లేదా? అయితే టర్మ్ లైఫ్ పాలసీ తీసుకోవడం బెటర్ అని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ పాలసీ సింపుల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సేఫ్ కూడా. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నిర్ధిష్టమైన టైమ్‌‌‌‌‌‌‌‌ను కవర్ చేస్తుంది. సాధారణంగా 10 నుంచి 30 ఏళ్లు. పాలసీ టైమ్‌‌‌‌‌‌‌‌లో పాలసీదారుడు చనిపోతే , అతను  నామినేట్ చేసిన వ్యక్తికి (నామినీ) ఒక మొత్తం (సమ్‌‌‌‌‌‌‌‌ అష్యూర్డ్‌)ను కంపెనీ చెల్లిస్తుంది.

టర్మ్ పాలసీ ఎందుకు బెటర్ అంటే ?

ప్రీమియం మారదు..
పాలసీహోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చెల్లించే ప్రీమియంను  అతని వయస్సు, ప్రస్తుత హెల్త్, లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్ (పొగ తాగుతావా, డ్రింక్ చేస్తావా వంటివి), ఇప్పటికే ఉన్న జబ్బులు, పాలసీ కవరేజ్, ప్రీమియం పే చేసే టైం, సమ్ అష్యూర్డ్‌‌‌‌‌‌‌‌ లాంటి అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ప్రీమియం అమౌంట్  పాలసీ టైం అంతా ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.   పాలసీ కొన్న స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లోనే టెన్యూర్ నిర్ణయిస్తారు. ఇది కూడా  మారదు.

చనిపోతే..
పాలసీహోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నామినేట్ చేసిన వ్యక్తికి పాలసీలోని సమ్‌‌‌‌‌‌‌‌ అష్యూర్డ్​‌ అమౌంట్ చెల్లిస్తారు. దీన్నే డెత్ బెనిఫిట్ అంటారు. 

యంగ్ ఏజ్‌‌‌‌‌‌‌‌లో పాలసీ కొంటే..
చిన్న వయస్సులోనే టర్మ్ ప్లాన్ తీసుకోవడం తెలివైన నిర్ణయమని  నిపుణులు చెబుతున్నారు.   లోన్స్, ఖర్చులు వంటి టెన్షన్లు లేకపోతే టర్మ్‌‌‌‌‌‌‌‌ పాలసీ కొనాలని సలహా ఇస్తున్నారు.  ఇంటి కోసం, పెళ్లి కోసం లాంటి ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నప్పుడూ టర్మ్ ప్లాన్ తీసుకోవడం బెస్ట్ అని పేర్కొన్నారు.

చిన్న వయసులో పాలసీ కొనడం వలన ఈ కింది లాభాలున్నాయి..


తక్కువ ప్రీమియం:
అన్ని రకాల లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌లో టర్మ్ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ ప్రీమియంలే తక్కువగా ఉంటాయి.  యంగ్‌‌‌‌‌‌‌‌ ఏజ్‌‌‌‌‌‌‌‌లో పాలసీ తీసుకుంటే వీటి ప్రీమియం మరింత తగ్గొచ్చు. 

ఎక్కువ సమ్‌‌‌‌‌‌‌‌ అష్యూర్డ్​:
చిన్న వయస్సులో టర్మ్‌‌‌‌‌‌‌‌ పాలసీ కొంటే,  ఎక్కువ సమ్‌‌‌‌‌‌‌‌ అష్యూర్డ్​‌ అమౌంట్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే, ఇన్సూరెన్స్ కంపెనీ నీ ఫ్యూచర్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ పొటెన్షియల్‌‌‌‌‌‌‌‌ని చూసి, నీకు హెల్త్ సమస్యలు లేకపోతే, ఎక్కువ అమౌంట్‌‌‌‌‌‌‌‌కి అప్రూవ్ చేస్తుంది.

లాంగ్ కవరేజ్ పీరియడ్:
కెరీర్ స్టార్ట్ అయినప్పుడే టర్మ్ ప్లాన్ కొంటే, ఎక్కువ కాలం కవరేజ్ పొందొచ్చు. అవసరమైతే టెన్యూర్‌‌‌‌‌‌‌‌ని పొడిగించుకోవచ్చు కూడా. ఇది  ఫైనాన్షియల్ కమిట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ (లోన్స్, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్) తీసుకునే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. 

ఎందుకు టర్మ్ ప్లాన్ తీసుకోవాలి ?

  • సింపుల్: ఇది స్ట్రెయిట్‌‌‌‌‌‌‌‌ఫార్వర్డ్. పాలసీ హోల్డర్‌‌ లేని పక్షంలో అతని  ఫ్యామిలీకి డబ్బు అందుతుంది. ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ వంటి క్లిష్టమైన స్టెప్స్‌‌‌‌‌‌‌‌ ఉండవు. 
  • చవక: ఇతర ఇన్సూరెన్స్ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే టర్మ్ ప్లాన్స్ ప్రీమియం చాలా తక్కువ.
  • ఫ్యామిలీకి దన్ను:  పాలసీ హోల్డర్​ చనిపోయిన తర్వాత కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌గా సేఫ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందనే గ్యారంటీ ఉంటుంది.

ఏం చెక్ చేయాలి?

  • సమ్‌‌‌‌‌‌‌‌ అష్యూర్డ్​‌: ఇన్‌‌‌‌‌‌‌‌కమ్, లోన్స్, ఫ్యూచర్ ఖర్చుల బట్టి సరిపోయే అమౌంట్ సెలెక్ట్ చేయాలి.  సాధారణంగా మీ యాన్యువల్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌కి 10–-15 రెట్లు సమ్  అష్యూర్డ్​‌ తీసుకోవడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 
  • టెన్యూర్: మీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ (పిల్లల ఖర్చులు, లోన్స్) ఎన్నాళ్లు ఉంటాయో అంత కాలం కవర్ అయ్యే టెన్యూర్ తీసుకోవడం ఉత్తమం. 
  • మంచి కంపెనీ: నమ్మదగ్గ ఇన్సూరెన్స్ కంపెనీని (హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ, ఐసీఐసీఐ, మాక్స్ లైఫ్ లాంటివి) సెలెక్ట్ చేసుకోవాలి.
  • హెల్త్ చెక్: హెల్త్ కండిషన్‌‌‌‌‌‌‌‌ని ఓపెన్‌‌‌‌‌‌‌‌గా చెప్పాలి. లేకపోతే క్లెయిమ్ టైంలో సమస్యలొస్తాయి.