11.6 కోట్లకు చేరిన డీమాట్​ అకౌంట్లు

11.6 కోట్లకు చేరిన డీమాట్​ అకౌంట్లు

న్యూఢిల్లీ: డీమాట్​ ఖాతాల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్​లో11.6 కోట్లకు చేరింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలలో 4శాతం పెరిగింది. దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి బలమైన ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లోలు రావడం, ఇన్​ఫ్లేషన్​ తగ్గడంతో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపుదల లేకపోవడం ర్యాలీకి దారితీశాయి. పాజిటివ్​ ఇన్వెస్టర్ సెంటిమెంట్ కూడా రోజువారీ ట్రేడింగ్ కార్యకలాపాల్లో పెరుగుదలకు కారణమయింది.

బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం, కొత్త ఖాతాల సంఖ్య (ఇంక్రిమెంటల్​గా​) మార్చిలో 19 లక్షల నుండి 18శాతం తగ్గి 16 లక్షలకు పడిపోయింది.  2023 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన సగటు కొత్త ఖాతాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 21 లక్షల డీమాట్​ ఖాతాలు ఓపెన్​ అయ్యాయి.