దేశంలో కొత్త ఉద్యమం : వీకెండ్ హాలిడే శుక్రవారం కావాలంట..

దేశంలో కొత్త ఉద్యమం : వీకెండ్ హాలిడే శుక్రవారం కావాలంట..

ఇప్పటివరకు అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో కొత్త ఉద్యమం పుట్టుకొచ్చింది. మణిపూర్లో శుక్రవారాన్ని వారపు సెలవు దినంగా ప్రకటించాలని ఆందోళన చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. శుక్రవారాన్నివీకెండ్ హాలిడేగా ప్రకటించాలని అక్కడి విద్యార్థి సంఘాలు  పిలుపునిచ్చాయి. అయితే విద్యార్థి సంఘాల డిమాండ్ మణిపూర్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని దీని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు అనుసరించవద్దని మణిఫూర్ ప్రభుత్వం కోరింది. 

మణిపూర్ రాష్ట్రంలో శుక్రవారం వారపు సెలవు దినంగా ప్రకటించారు చురచంద్ పూర్ కు చెందిన ఉమ్మడి విద్యార్థి సంఘం (జేఎస్ బీ ) పిలుపునిచ్చింది. దీనిపై మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు గవర్నర్ స్పందించారు. ప్రభుత్వ సంస్థలు, బాధత్యయుతమైన విద్యాసంస్థలు ఈ చట్టవిరుద్దమైన అంశాలను అమలు చేయొద్దని.. ఎవరూ ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించకూడదని  ఆదేశించారు. జాయింట్ స్టూడెంట్స్ బాడీ తీర్మానాన్ని ఎవరైనా అమలు చేస్తే చట్టపరమైన చర్యలు, కేసులు పెడతామని పేర్కొన్నారు. 

ALSO READ : దేశంలో కొత్త ఉద్యమం : వీకెండ్ హాలిడే శుక్రవారం కావాలంట..