హైదరాబాద్, వెలుగు: భారత్- యూఏఈ మధ్య విమాన సర్వీసులపై ఉన్న పరిమితులు ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తాయని టూరిజం ఎకనమిక్స్ స్టడీ రిపోర్ట్ తెలిపింది. డిమాండ్‌కు తగ్గట్టుగా విమాన సీట్ల సామర్థ్యం పెంచకపోతే 2035 నాటికి 27 శాతం డిమాండ్ తీరదు. 2026–2035 మధ్య సుమారు 5.45 కోట్ల మందికి విమానాలు అందుబాటులో ఉండకపోవచ్చు.
భారత్‌లో విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య 24 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. విమాన సర్వీసులు పెంచడం వల్ల వచ్చే ఐదేళ్లలో జీడీపీకి 7.2 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం, 1.70 లక్షల ఉద్యోగాలు వస్తాయని రిపోర్టు వివరించింది.---
