టెన్షన్ లో టైగర్

టెన్షన్ లో టైగర్
  • తగ్గిపోతున్న సంతానోత్పత్తి శక్తి
  • టూరిజమే కారణమన్న సీసీఎంబీ సైంటిస్టులు

హైదరాబాద్, వెలుగు:అరే.. సెలవొచ్చింది.. సఫారీకి వెళ్దామా ..!  అడవిలోప్రయాణం. వావ్.. పులులు, జింకలు, కోతులు భలేఉంటాయ్ వెళ్దామంటే పిల్లలకే కాదు పెద్దలకూఎక్కడాలేని హుషారొ స్తుంది. ప్రపంచవ్యాప్తంగాబయోడైవర్సిటీ టూరిజంకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. నేషనల్ పార్కులని, బయోడైవర్సిటీ పార్కు లనుంచి ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వస్తోం ది. ఈటూరిజం వల్ల మనుషులకైతే ఆనందం వస్తుందేమోకానీ, జంతువులు మాత్రం ఆపదలో పడుతున్నాయి.తమ సహజ జీవనం మొదలు పునరుత్పత్తి శక్తివరకూ అన్నీ కోల్పోతున్నాయి.

ముఖ్యంగా పెద్ద పులుల జీవన విధానంపై టూరిజం విపరీతంగా ప్రభావం చూపుతోం దని సెం టర్ ఫర్సెల్యూలార్ అండ్ మైక్రోబయాలజీ(సీసీఎంబీ) సైంటిస్టులు తేల్చారు. దేశంలో పులుల సంఖ్యతగ్గడానికి గల కారణాలను కనుగొనేం దుకు సీసీఎంబీకి చెం దిన సైం టిస్టులు ఓ టీమ్ గా ఏర్పడ్డా రు.చాలా ప్రాంతాల్లోని సఫారీలను, జూ పార్కు లనుసందర్శించారు. పులుల ప్రవర్తనను సునిశితంగా పరిశీలించారు. జనం టూరిజం పేరిట పులుల సందర్శనకు వెళ్లడం వాటిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నట్లు గుర్తించారు. ఫలితంగా ఆ ప్రభావం సంతానోత్పత్తిపై పడుతోందని తేల్చారు.

60 శాతం ప్రీ-రోమింగ్ టైగర్లు

దేశంలో ఉన్న 60 శాతం పులులు అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సఫారీల్లోనే ఉన్నాయి. వీటిని టూరిజం స్పాట్లుగా మార్చడంతో మనుషులు వెళ్తున్నారు. సీసీఎంబీకి చెందిన డా.ఉమాపతి నేతృత్వం లోని సైంటిస్టుల టీమ్ మధ్యప్రదేశ్లోని బాంధవ్ ఘర్, కన్హా టైగర్ రిజర్వ్ లోని 341పులుల ‘ఫేకల్ గ్లూకో కార్టికోయిడ్’ లెవల్స్ పై అధ్యయనం చేశారు. టూరిస్టులు తిరిగిన టైంలోఉన్నప్పటి లెవల్స్ ను, టూరిస్టు లు లేని టైం లోఉన్నప్పటి లెవల్స్ ను విడివిడిగా నమోదు చేశారు.టూరిస్టు ల తాకిడి ఉన్నప్పుడు పులుల్లో గ్లూకో కార్టికోయిడ్ లెవల్స్ బాగా తగ్గుతున్నాయని గుర్తిం చారు.ఫలితంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాయనితేల్చారు. ఫలితంగా సంతానలేమి, పెరుగుదల లేకపోవడం వంటి సమస్యలు తలెత్తున్నట్లు పేర్కొ న్నారు.ఇదే రీతిలో సఫారీల్లో టూరిజం కొనసాగితే భవిష్యత్ లో పులుల జనాభా మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.