భద్రాచలం, వెలుగు : మూడు నెలల విరామం తర్వాత పాపికొండల టూరిజం గురువారం మొదలైంది. విలీన వీఆర్‌పురం ఎస్సై సంతోష్‌కుమార్ టూర్‌ను ప్రారంభించారు. మొదటి రోజైన గురువారం రెండు లాంచీల్లో 97 మంది టూరిస్టులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు లాంచీల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసిన తర్వాత వాటికి పర్మిషన్ ఇచ్చారు. భద్రాచలంలో శ్రీరాముడిని దర్శించుకున్న అనంతరం టూరిస్టులు ప్రత్యేక వాహనాల్లో వీఆర్‌పురం మండలం పోచవరం గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి లాంచీల్లో వెళ్లి పాపికొండల్లో విహరించారు.
