గ్లామరస్ రెబెకా.. యష్ ‘టాక్సిక్’ నుంచి తారా సుతారియా లుక్ రిలీజ్

గ్లామరస్ రెబెకా.. యష్ ‘టాక్సిక్’ నుంచి తారా సుతారియా లుక్ రిలీజ్

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ గ్లామర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పేరుతెచ్చుకున్న తారా సుతారియా నటిస్తున్న లేటెస్ట్ మూవీ  ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫ‌‌‌‌‌‌‌‌ర్ గ్రోన్ అప్స్’. కన్నడ స్టార్ యశ్‌‌‌‌‌‌‌‌ హీరోగా రూపొందుతోన్న ఈ  ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో తారా కీలక పాత్రలో కనిపించనుంది.

శనివారం ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె రెబెకా పాత్ర పోషిస్తున్నట్టు  తెలియజేశారు. గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తూనే గన్ పట్టుకుని క్యూరియాసిటీ పెంచేలా ఉంది తన పోస్టర్. త‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ను తాను ర‌‌‌‌‌‌‌‌క్షించుకోగ‌‌‌‌‌‌‌‌ల ధైర్యం, సామ‌‌‌‌‌‌‌‌ర్థ్యమున్న పాత్రలో ఆమె మెప్పించ‌‌‌‌‌‌‌‌నుందని మేకర్స్ తెలియజేశారు.

గీతు మోహన్ దాస్ రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే  యశ్‌‌‌‌‌‌‌‌తోపాటు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి పాత్రలను పరిచయం చేసి సినిమాపై అంచనాలు పెంచారు.  కేవీఎన్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్‌‌‌‌‌‌‌‌ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.  మార్చి 19న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.