
షాపింగ్ మాల్స్ కేవలం షాపింగ్ కోసమే కాకుండా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి కూడా అడ్డాగా మారాయి.పెద్దల కోసం మల్టిప్లెక్స్ లు ఉంటే పిల్లల కోసం గేమింగ్ జోన్స్, టాయ్ ట్రైన్స్ వంటివి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటున్నాయి. వీటితో పాటు ఫుడ్ జోన్స్ కూడా ఉండటంతో షాపింగ్ చేయటం కోసం వచ్చే వారికంటే కాలక్షేపం కోసం వచ్చేవారే ఎక్కువగా ఉంటారు మాల్స్ లో.ఆలా చండీఘడ్ లోని ఓ ఫ్యామిలీ షాపింగ్ మాల్ కి వెళ్లి ఓ ఫ్యామిలీ కడుపుకోత కొనితెచ్చుకుంది.
వివరాల్లోకి వెళితే, చండీఘడ్ లోని ఎలంటే షాపింగ్ మాల్ లో ఓ పదేళ్ల పిల్లాడు టాయ్ ట్రైన్ నుండి ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. షాపింగ్ మాల్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా సదరు పిల్లాడు ట్రైనింగ్ కిటికీ నుండి బయటకు తొంగి చూస్తున్న క్రమంలో కింద పడినట్లు, ఆ సమయంలో టాయ్ ట్రైన్ పిల్లాడి మీద పడినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన పదేళ్ల పిల్లాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ ను అరెస్ట్ చేసి, టాయ్ ట్రైన్ ను సీజ్ చేశారు.