Team India: బీసీసీఐతో చేతులు కలపనున్న కొత్త కంపెనీ.. టీమిండియాకు స్పాన్సర్‌ దొరికేసినట్టే

Team India: బీసీసీఐతో చేతులు కలపనున్న కొత్త కంపెనీ.. టీమిండియాకు స్పాన్సర్‌ దొరికేసినట్టే

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ డ్రీమ్11కు బీసీసీఐ సోమవారం (ఆగస్టు 25) గుడ్ బై చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు 2025’కు ఆమోదం తెలపడంతో రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనీ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాన్ కావడమే ఇందుకు కారణం. బీసీసీఐ, డ్రీమ్11 మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయాయని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధృవీకరించారు. జులై 2023 నుంచి టీమిండియా లీడ్ స్పాన్సర్గా డ్రీమ్11 కొనసాగుతోంది. బీసీసీఐతో చేసుకున్న కాంట్రాక్టు ప్రకారం 2023 నుంచి 2026 వరకూ టీమిండియా లీడ్ స్పాన్సర్గా డ్రీమ్11 కొనసాగాల్సి ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదు. 

డ్రీమ్ 11 నుంచి విడిపోవడంతో ఆసియా కప్ ముందు భారత క్రికెట్ జట్టు కొత్త స్పాన్సర్ షిప్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి. డ్రీమ్11 నిష్క్రమణ తర్వాత రెండు కంపెనీలు బీసీసీఐతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. టయోటా మోటార్ కార్పొరేషన్, ఫిన్‌టెక్ స్టార్టప్ భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. టయోటా మోటార్ కార్పొరేషన్ కంపెనీ దాదాపు టీమిండియాకు కొత్త స్పాన్సర్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా కప్ కోసం డ్రీమ్ 11 ఉన్న లోగోలను ఇప్పటికే టీమిండియా జెర్సీలపై ముద్రించినా వాటిని కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం ఉపయోగించదని తెలుస్తోంది.

►ALSO READ | Sanju Samson: ఈ విధ్వంసానికి గిల్ కూడా తప్పుకోవాల్సిందే.. ఓపెనర్‪గా 42 బంతుల్లో శాంసన్ సెంచరీ

దేశంలోని ఏ చట్టం అనుమతించని ఏ పనిని బీసీసీఐ చేయదని.. దేశంలో అమలు చేయబడిన ఏ చట్టాలను బోర్డు ఉల్లంఘించదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా చెప్పుకొచ్చారు. 358 కోట్లకు బీసీసీఐతో డ్రీమ్11 కాంట్రాక్టు కుదుర్చుకుంది. అయితే.. ఆన్ లైన్ గేమింగ్ యాక్ట్ అమల్లోకి రావడంతో ఒక ఏడాది మిగిలి ఉండగానే డ్రీమ్11కు బీసీసీఐ గుడ్ బై చెప్పాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. 2023లో బీసీసీఐతో రూ. 358 కోట్ల రూపాయల ఒప్పందంతో BYJU నుండి డ్రీమ్11 స్పాన్సర్‌గా బాధ్యతలు స్వీకరించింది.