హన్మకొండ: బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమర్ గౌడ్ ఫైర్ అయ్యారు. దేవుళ్ల పేరుతో ఓట్లడిగే బిచ్చగాళ్లు బీజేపీ నేతలని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హన్మకొండలో ఇవాళ (సెప్టెంబర్ 18) కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ALSO READ | రాహుల్ గాంధీపై బీజేపీ కుట్ర చేస్తుంది : మంత్రి సీతక్క
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు గాడ్సేల్లా, ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కులాలు, మతాల పేరుతో బీజేపీ చిచ్చుపెడుతోందని, దేశ భద్రతకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎందుకు చనిపోయారో దేశానికి తెలియదా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం గురించి.. వాళ్ల త్యాగం గురించి మొత్తం దేశానికి తెలుసని బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.