మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఏజన్సీ ప్రాంతం కావడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ.. బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అన్నారు. బీజేపీ రాహుల్ గాంధీని... బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశామయన్నారు. గంగారం, కొత్తగూడ మండలంలో నిరుపేదలు అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు.
హర్యానా లో బీజేపీ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ నీ చంపుతామని బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని.. వెంటనే వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఇందిరా గాంధీ కుంటుంబం పై బీజేపీ కుట్ర చేస్తుందంటూ.. వెంటనే ప్రధాని మోదీ రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ కుట్రలును తిప్పికొడతామని.. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూసిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భాష దారుణంగా ఉందని .. హుజూరాబాద్ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోడ్డు ఎక్కాడని విమర్శించారు. బీజేపీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భాష.. వారి ప్రవర్తనను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.